ఉగ్రపోరులో మీరు మెచ్చిన 10 స్టోరీలు

Written By:
  X

  ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వైపు నడుస్తున్నట్లుగా ఉంది. ఉగ్రవాదుల వేటలో అన్ని దేశాలు ఉలిక్కి పడాల్సిన పరిస్థితి. ఉగ్రవాద మూలాలనే ఏరిపారేసేందుకు ఇప్పుడు అన్ని దేశాల తక్షణ కర్తవ్యంలా మారింది. అందుకోసం ప్రపంచంలోని అన్ని దేశాలు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలను సేకరించుకుంటూ ఉగ్రవాదులతో పాటు ఇతర దేశాలకు సవాల్ ను విసురుతున్నాయి. ఇటువంటి వాటిని గిజ్‌బాట్ ఎప్పటికప్పుడు మీ కందిస్తూనే ఉంది. వాటిని మీరు ఆదరిస్తూనే ఉన్నారు.ఈ సంధర్భంగా గిజ్‌బాట్ అభిమానుల మనసు దోచుకున్న ఓ 10 సంచలన స్టోరీలను మీ ముందుకు తెస్తున్నాం..

  Read more: చావు బతుకుల మధ్య ఫోన్ పదనిసలు

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ప్రపంచ దేశాలకు భారత్ షాక్

  ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నిస్తోంది.. అణు ఆయుధ రంగంలో ఇతర దేశాలను సవాల్ చేస్తూ దూసుకుపోతోంది. ఇతర దేశాలకు చుక్కలను చూపించే అణ్వాయుధాలను తయారుచేసేంత సామర్థ్యం భారత్ కు ఉందని..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందని అమెరికా తేల్చి చెప్పింది. అత్యంత భయానక విధ్వంసం సృష్టించే ఆయుధాలను తయారు చేయగల ప్లూటోనియంతో పాటు యురేనియం ఇండియా దగ్గర పుష్కలంగా ఉందని అమెరికాకు చెందిన ఓ రిపోర్ట్ వెల్లడి చేసింది.మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

  ‘అగ్ని’ ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది

  అగ్ని... ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచదేశాలకు ముచ్చెమటలుపడుతున్నాయి. భారత అణు సామర్ధ్యాన్ని చాటి చెప్పిన 'అగ్ని' క్షిపణులు ఇప్పుడు ప్రపంచదేశాలకు యుద్ధ రంగంలో సవాల్ విసురుతున్నాయి. వరుసగా విజయవంతమవుతున్నఅగ్ని ప్రయోగాలతో భారత అణుసామర్ధ్యం ఇప్పుడు అగ్రరాజ్యాలకు ధీటుగా తయారైంది. శత్రు క్షిపణులను ఒకే ఒక్క దెబ్బతో సర్వనాశనం చేయగల ఈ అగ్ని ఎప్పుడు ప్రయోగం జరిపినా నిప్పులు చిమ్మకుంటూ ఆకాశంలోకి దూసుకెళుతోంది.ప్రపంచదేశాలకు వణుకుపుట్టిస్తున్న ఈ అగ్ని క్షిపణులపై ప్రత్యేక కథనం.

  ఐఎస్‌ఐఎస్ వార్నింగ్‌తో వేడెక్కిన యుద్ధం

  పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఉగ్రవాదులు బాంబులు, తుపాకులు, ఆత్మాహుతి దాడులతో ఒకరోజంతా పారిస్ లోని వేర్వేరు ప్రాంతాలలో తెగబడి 130మందిని పొట్టనబెట్టుకున్న వైనం మాటలకు అందనిది. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని అన్ని దేశాలు ఇప్పుడు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా అమెరికా తన అణ్వాయుధాలపై ఫ్రమ్ పారిస్ విత్ లవ్ అంటూ రాసి వాటిని సిరియాలోని ఉగ్రవాదులపై వదిలింది. అయితే దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ సారి వాషింగ్టన్ నడిబొడ్డున్న కాల్పులకు తెగబడతామని ప్రకటించారు. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

  వారి అంతు చూస్తాం: పట్టిస్తే రూ. 330 కోట్లు

  రష్యా ఆయుధాలతో ప్రపంచాన్ని అలాగే ఉగ్రవాదులను భయపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఇప్పుడు రష్యా కలిగి ఉంది. మొన్న ఉగ్రవాదుల దెబ్బ రష్యాను ఇప్పుడు అత్యాధునికి ఆయుధాలను సమకూర్చుకునేలా చేస్తోంది. రష్యా విమానాన్ని కూల్చివేసింది ఉగ్రవాదులేనని నివేదికలు తేల్చడంతో ఇప్పుడు రష్యా వారి అంతుచూసేవరకు నిద్రపోయేది లేదని తేల్చి చెప్పడంతో ఉగ్రవాదులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అంతేకాకుండా రష్యా విమానాన్ని కూల్చివేసిన వారి జాడ చెప్పిన వారికి 330 కోట్ల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. దీంతో పాటు రష్యా చేతిలో ఉన్న అస్త్రాలను కూడా చూద్దాం.

  ఉగ్రవాదుల టెక్నాలజీతో షాక్ : పారిస్‌కు మరో ముప్పు

  పారిస్‌పై దాడికి ఐఎస్‌ఐఎస్ వాడిన టెక్నాలజీని చూసిన వారికి కళ్లు బైర్లు కమ్మతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారు సాగించిన మారణకాండను చూసిన ఇన్విస్టిగేషన్ అధికారులు సైతం షాక్ కు గురవుతున్నారు. కేవలం వీడియో గేమ్స్, ఫోన్ యాప్స్ , టెలిగ్రాంల ద్వారానే పారిస్ లో నరమేధం సృష్టంచారనే నిజాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఇంకా ఐ ఫోన్ ఎన్ క్రిప్సన్ యాప్స్ తో ప్లాట్ అవుట్ సైడ్ రక్తపుటేరులు పారించారని ఇన్విస్టిగేషన్ లో తేలింది. విస్తుగొలిపే నిజాలను చదవండి.

  తన చావును తనే కొని తెచ్చుకుంటోంది

  రానున్న కాలంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాలతో ప్రపంచానికే ఓ పీడకలగా మారనుందా.. తాను తయారుచేసిన అణ్వాయుధాలే ఆ దేశ కొంపలు ముంచనున్నాయా..లేక ఆ అణ్వాయుధాలతో ప్రపంచానికి ప్రమాదకరరీతిలో అది తయారుకానుందా..ఒక్కో స్థానం ఎగబాకుతూ అమెరికా,రష్యాలను తలదన్నే రీతిలో బాంబులను తయారుచేయనుందా.. ఆ బాంబులే పాకిస్తాన్ కొంప ముంచేందుకు సిద్ధమవుతున్నాయా.. అంటే అవుననే అంటోంది అమెరికా..అది ప్రపంచానికే పెనుముప్పుగా మారబోతుందని అలాగే తన చావును తనే కొని తెచ్చుకోబోతుందని ఆ దేశ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనం రాసింది.మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

  విమానం కూలిపోలేదు బాంబుతో పేల్చారు

  రష్యా విమానం సాంకేతిక లోపంతో కూలిపోయిందని రష్యా అధికారులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అది సాంకేతిక లోపం కాదని దాన్ని బాంబులతో పేల్చారని బ్రిటన్ ,అమెరికా అధికారులు తేల్చి చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఓ చిన్న తీవ్రవాద సంస్థగా పుట్టుకొచ్చిన ఐసిస్‌ విమానాలను కూల్చేస్థాయికి ఉగ్రవాదాన్ని విస్తరించిందా...? విమానాలను కూల్చివేసే ఆయుధ సంపత్తి ఐసిస్ వద్ద ఉందా...! సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయిందని రష్యా, ఈజిప్టు ఎందుకు చెబుతున్నాయి...! మానవ ప్రమేయం లేదన్నప్పుడు తామే బాధ్యులమని ఐసిస్ ఎందుకు చెబుతోంది... విమాన ప్రమాదం వెనుక ఇలాంటి ఎన్నో ప్రశ్నలు...కాని లోతులకెళ్లే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..

  బ్రహ్మోస్‌‌తో శత్రు దేశాలకు ఇక చుక్కలే

  అరేబియా సముద్రంపై ఐఎన్ ఎస్ కోచి నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. సుమారు 290 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన బ్రహ్మోస్ విజయవంతంగా లక్ష్యాన్ని తాకింది.సూపర్ సోనిక్ క్రూయిజ్ తరహాలో తయారైన క్షిపణిని పూర్తి స్థాయి దూరంలోని లక్ష్యంపై ప్రయోగించారు.సముద్ర ఉపరితలంపై నిలిచి ఉండే సుదూర యుద్ధ నౌకలను దీని సాయంతో సులువుగా ముంచేయవచ్చు కూడా. ఈ ప్రయోగ విజయవంతంతో భారత యుద్ధ సామర్థ్యం మరో మెట్టెక్కినట్లయింది. బ్రహ్మోస్ పై మిరుమిట్లు గొలిపే నిజాలివే.

  రష్యా ఉగ్రరూపం: ప్రపంచాన్ని కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

  రష్యా ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. దానికి తోడు రష్యాలో ఇప్పుడు అమెరికా కన్నా అత్యంత శక్తివంతమైన ,శత్రువులను క్షణాల్లో మట్టుబెట్టగల ఆయుధాలు ఉన్నాయని వీటితో రష్యా ఇప్పుడు తన ఉగ్రరూపం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా అమెరికాను మించిన పవర్ కలిగి ఉందని అమెరికాకు చెందిన మాజీ యుఎస్ ఆర్మీ ఆఫీసర్ చెప్పడంతో ఇప్పుడు మళ్లీ యుద్ధమేఘాలు రాజుకునేలా ఉన్నాయి. అదీగాక రష్యా విమానం మేమే కూల్చామని ఉగ్రవాదులు చెప్పడంతో రష్యాకు పుండు మీద కారం చల్లినట్లయింది. అందుకే తాడో పేడో తేల్చుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిగతా కథనం స్లైడర్ లో.

  నీ వెన్నుపోటు దురాగతాలు మానుకో..

  టర్కీ సైన్యం రష్యా యుద్ధవిమానాన్ని కూల్చివేసిన ఘటనపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలో ప్రవేశించిన రష్యా యుద్ధవిమాన పైలెట్లకు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే కూల్చివేశామని టర్కీ బల్లగుద్దీమరీ చెబుతోంది.అయితే ఈ ప్రకటనను రష్యా తప్పుపట్టింది. తమ విమానం టర్కీ భూభాగంలో ప్రవేశించకపోయినా కూల్చివేశారంటూ... ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా కూల్చడం టర్కీకి తగదని ముందు ముందు దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలకు ఊతమిస్తూ రష్యా తన ఎయిర్ ఢిపెన్స్ మిస్సైల్స్ ను ఇప్పుడు సిరియాకి తరలించింది. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Read more about:
  English summary
  Here Write top ten hi tech weapons Storys in this month
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more