అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పూర్తి సమాచారం!!! ఇవే బెస్ట్...
ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు. ఈ సమయంలో అధిక డేటా అవసరం ఉన్న వారి కోసం సర్వీసు ప్రొవైడర్లు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. యూజర్ల యొక్క వినోద అవసరాలు మరియు వారి యొక్క ఉద్యగ అవసరాల కోసం ప్రతి నెలా భారీ డేటాను వినియోగించవలసి ఉంటుంది.

అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు
ప్రస్తుతం మార్కెట్లో సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్ లలో చాలా రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, ZEE5, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోని కంటెంట్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులలో అధిక డేటాను ఉపయోగించే వారు డేటా క్యాప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మీరు గేమర్ అయితే కనుక హై-స్పీడ్ అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్ ద్వారా మీరు పెద్ద గేమ్ లను ఎటువంటి ఇబ్బంది లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను అందించే ఉత్తమ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
టెలికామ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఎయిర్‌టెల్ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం పలు రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇంటర్నెట్ యొక్క స్పీడ్ 100Mbps నుండి గరిష్టంగా 1 Gbps వరకు ఉండే ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. ఎయిర్టెల్ కస్టమర్లు కేవలం రూ.299 చెల్లించడం ద్వారా తమ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అపరిమిత ప్లాన్‌గా సులభంగా మార్చవచ్చు. ఇది అక్షరాల నిజం. మీరు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ అయితే కనుక ప్రతి నెలా రూ.299ల తక్కువ మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా మీ ప్లాన్‌ను అపరిమిత ప్లాన్‌గా సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇతర సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా కాకుండా ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్ లను ప్రత్యేకంగా అందించడం లేదు.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
టెలికాం రంగంలో అతిపెద్ద ఆపరేటర్ గా ఎదిగిన రిలయన్స్ జియో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. జియోఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.699 ధర నుండి ప్రారంభమై రూ.8,4999 ధర వరకు లభిస్తాయి. జియోఫైబర్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అపరిమిత డేటా ప్లాన్‌లను చూపించినప్పటికీ వాటి FUP పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. ఒకవేళ మీరు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మీద ఆసక్తి ఉంటే కనుక ప్లాటినం మరియు టైటానియం వంటి జియోఫైబర్ ప్రీమియం ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇవి 1Gbps ఇంటర్నెట్ వేగంతో వరుసగా 7500GB మరియు 15000GB FUP పరిమితి డేటాతో లభిస్తాయి. వినియోగదారులు జియో యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం తమ ఇంటర్నెట్ ప్లాన్‌ను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. ఇది వారి పని మరియు వినోద అవసరాలను తీర్చగలదు.

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
ప్రభుత్వ జోక్యంతో మళ్ళి పుంజుకున్న బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఇప్పుడు తన వినియోగదారులకు వివిధ రకాల ధరల వద్ద హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఏదేమైనా BSNL యొక్క అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు FUP పరిమితిని కలిగి ఉంటాయి. ఇవి వాటి యొక్క FUP పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగంను తగ్గిస్తుంది. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.499 నుండి ప్రారంభమయి రూ.16,999 ధర వరకు అందిస్తాయి. డేటా పరిమితి మరియు ఇంటర్నెట్ వేగాన్ని బట్టి ధరలు ఉంటాయి. రూ. 849 ధర గల 600GB CUL ప్లాన్ 50Mbps వేగంతో 600GB డేటాను అందిస్తుంది. BSNL అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్‌లను అందించనందున భారీ డేటాను కోరుకునే BSNL బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు నిరాశే ఎదురైంది.

ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఇతర ప్రయోజనాలతో పాటు హై-స్పీడ్ డేటాతో అందిస్తున్నది. ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ నిజంగా అపరిమిత డేటాను అందించదు. ACT ఫైబర్నెట్ యొక్క అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు FUP పరిమితిని కలిగి ఉండి వాటి తరువాత ఇంటర్నెట్ వేగం తగ్గించబడుతుంది. ఇందులో అపరిమిత ప్లాన్‌లు లేనప్పటికీ మరిన్ని ఆకర్షణీయమైన ప్రయోజనాలతో ACT ఫైబర్నెట్ అనేక ఇతర ప్లాన్‌లను అందిస్తుంది.

ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరల వివరాలు
ACT లైటింగ్ ప్లాన్ రూ.1425 ధర వద్ద 800GB నెలవారీ డేటాను 200Mbps ఇంటర్నెట్-స్పీడ్‌తో అందిస్తూ ఉత్తమమైన సరసమైన ప్లాన్ లలో ఒకటిగా ఉంది. కస్టమర్లు మరింత ఎక్కువ డేటాను కావాలనుకునే వారు ACT ప్రోగ్రెస్ మరియు ACT GIGA వంటి ప్రీమియం ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇవి 250Mbps మరియు 1000Mbps ఇంటర్నెట్ వేగంతో వరుసగా ఒక నెలకు 2500GB మరియు 3500GB డేటాను అందిస్తాయి. ACT ప్రోగ్రెస్ ప్లాన్ ధర రూ.4,999 కాగా, ACT GIGA ప్లాన్ ధర 5,999 రూపాయలు. ACT ఫైబర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలు ప్రతి నగరంలోను విభిన్నంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








