Just In
- 14 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 16 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 20 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 22 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
Don't Miss
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RS.300లలోపు వోడాఫోన్ అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్స్
ఇండియాలోని టెలికామ్ పరిశ్రమలో వున్న ఆపరేటర్లలోని వోడాఫోన్ ప్రస్తుతం వివిధ సర్కిల్‌లలోని వినియోగదారులకు అనేక అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వోడాఫోన్ బండిల్ చేసిన డేటా, వాయిస్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో ఈ అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్స్ వివిధ రకాల వాలిడిటీతో వస్తాయి.

రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ మాదిరిగా వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్ సదుపాయాన్ని అందించడం లేదు. వాస్తవానికి ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌ను అందిస్తోంది కానీ వోడాఫోన్ మాత్రం అందించడం లేదు. డిసెంబర్ 1 నుండి ధరల సుంకాలను పెంచుతున్నందున అంతకు ముందుగా లాంగ్ టర్మ్ ప్లాన్ లతో రీఛార్జ్ చేయడం చాల ఉత్తమం.

వొడాఫోన్ రూ.300 లోపు అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. వోడాఫోన్ యొక్క అపరిమిత కాంబో ప్లాన్‌లు రూ.129 నుండి ప్రారంభమవుతాయి. ఇందులో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజులు చెల్లుబాటుతో వస్తుంది. టెల్కో షిప్‌ల నుండి రోజుకు 2.5 జిబి డేటాతో రూ.255 అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ .150 లోపు
వోడాఫోన్ రూ.150 లోపు రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇవి రెండు ఓపెన్ మార్కెట్ ప్లాన్‌లు. అవి అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 ఎస్‌ఎంఎస్‌ల వంటి ప్రయోజనాలను 28 రోజుల పాటు అందిస్తాయి. ఇందులో రూ.129 ప్లాన్ 2 జీబీ డేటా బెనిఫిట్‌తో వస్తుండగా, రూ.139 ప్లాన్ నెలకు 3 జీబీ డేటా బెనిఫిట్‌ను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్లు తక్కువగా డేటాను మరియు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసే వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ .200 లోపు
వోడాఫోన్ రూ.200 లోపు అందిస్తున్న అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాల విషయానికి వస్తే ఇందులో రూ.169 & రూ.199 రెండు ప్లాన్లు ఉన్నాయి. ఇందులో రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1 జిబి డేటాను అందిస్తుంది. అలాగే రూ.199 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు కూడా ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు తన మొత్తం చెల్లుబాటు కాలంలో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తాయి.

ప్రీపెయిడ్ రూ .250 లోపు
రూ .200 నుంచి 250 మధ్యలో వోడాఫోన్ మొత్తంగా రూ .205, రూ. 209, రూ .225, రూ. 229 వంటి నాలుగు అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇందులో రూ.205, రూ.229 ప్లాన్‌లు మెరుగైన డేటా ప్రయోజనంను అందిస్తున్నాయి. ప్యాక్‌లలో మొదటిది రూ .205 ప్లాన్ ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, 2 జిబి డేటా మరియు 600 SMSలను 35 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. రూ .225 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, 4 జీబీ డేటా బెనిఫిట్, 600 ఎస్‌ఎంఎస్ వంటి ప్రయాజనాలను 48 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తాయి.

రూ .209 ప్రీపెయిడ్ ప్లాన్ 1.6 జిబి రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే రూ.229 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జిబి రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ రెండు ప్లాన్లు 28 రోజుల చెల్లుబాతో వస్తాయి. అలాగే ఇవి రోజుకు 100 SMS లు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.300 లోపు
వొడాఫోన్ అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క చివరి విభాగంలో రూ.250 మరియు 300 రూపాయల మధ్య విషయానికి వస్తే ఇందులో రూ.255 & రూ.299 ధరలతో గల రెండు ప్లాన్లు ఉన్నాయి. పరిశ్రమలోని ఏ టెల్కో నుండి అయినా 70 రోజుల చెల్లుబాటును కేవలం 299 రూపాయలకు అందించడం చౌకైన ప్రణాళిక. రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 1000 SMS లు 70 రోజుల చెల్లుబాటుతో లబిస్తాయి.

వోడాఫోన్ యొక్క రూ.255 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ తన మొత్తం చెల్లుబాటు కాలంలో 70GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇతర వోడాఫోన్ ప్రీపెయిడ్ కాంబో ప్లాన్‌ల మాదిరిగానే ఇది కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను 28 రోజుల పాటు అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190