మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ సూపర్‌ఫోన్!

Posted By: Prashanth

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ సూపర్‌ఫోన్!

 

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘సూపర్ ఫోన్ ఏ84’ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. కీలక ఫీచర్లు.. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. 4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్800× 480పిక్సల్స్), 1 గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 5మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), బ్లూటూత్ వర్షన్ 2.1, జీపీఎస్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, మోషన్ సెన్సార్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, శక్తివంతమైన 1630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ. మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్ ఏ84 ప్రత్యర్ధి బ్రాండ్‌లు రూపొందించిన స్పైస్ స్టెల్లార్, ఐబాల్ ఆండీ స్మార్ట్‌ఫోన్‌లతో తలపడనుంది.

మైక్రోమ్యాక్స్ సోలార్ ఫోన్!

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమాక్స్ కరెంటు చార్జింగ్‌తో పనిలేకుండా సోలార్ చార్జింగ్ పై పనిచేసే శక్తివంతమైన డ్యూయల్ సిమ్ ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మైక్రోమాక్స్ ఎక్స్259. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్ సూర్యరసిమి ద్వారా శక్తిని గ్రహించుకుంటుంది. సోలార్ ప్యానల్ ద్వారా డివైజ్ మూడు గంటల్లో సంపూర్ణ చార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ 1.5గంటల టాక్‌టైమ్ నిస్తుంది. నిత్యం విద్యుత్ అంతరాయాలతో ఇబ్బందులను ఎదుర్కొనే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ఫోన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఎక్స్259 కీలక ఫీచర్లు:

2.4 అంగుళాల డిస్ ప్లే, (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

1.3మెగా పిక్సల్ కెమెరా,

బ్లూటూత్, జీపీఆర్ఎస్,

మై-జోన్/మై-స్టోర్ లోకి ప్రవేశించే సౌలభ్యత,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.2,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot