నోకియా కొత్త ఫోన్‌లు.. నేడే రిలీజ్!

Posted By: Prashanth

నోకియా కొత్త ఫోన్‌లు.. నేడే రిలీజ్!

 

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ నోకియా ఆషా సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను గురువారం ఆవిష్కరించనుంది. నోకియా ఆషా 305, నోకియా ఆషా 306, నోకియా ఆషా 311 మోడళ్లలో విడుదల కాబోతున్న ఈ ఫోన్‌లు రూ.10,000ల ధరకు దిగువన ఉంటాయి. అనధికారికంగా తెలిసిన సమాచారం మేరకు ఈ పోన్‌లు సమర్ధవంతమైన టచ్‌ స్ర్కీన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. ఎస్40 ఆషా ఆపరేటింగ్ సిస్టంను ఫోన్‌లలో వినియోగించినట్లు తెలిసింది.

నోకియా ఆషా 305 కీలక ఫీచర్లు:

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,(రిసల్యూషన్ 240x320పిక్సల్స్),

డ్యూయల్ సిమ్,

3మెగా పిక్సల్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్,

1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ(స్టాండ్‌బై టైమ్ 528 గంటలు),

ఐఎమ్ సర్వీసెస్ సపోర్ట్ ( గూగుల్ టాక్, యాహూ మెసెంజర్, విండోస్ లైవ్ మెసెంజర్).

నోకియా ఆషా 306 కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,(wqvga రిసల్యూషన్),

wlan కనెక్టువిటీ,

3మెగా పిక్సల్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్,

1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ(స్టాండ్‌బై టైమ్ 528 గంటలు),

ఐఎమ్ సర్వీసెస్ సపోర్ట్ ( గూగుల్ టాక్, యాహూ మెసెంజర్, విండోస్ లైవ్ మెసెంజర్).

నోకియా ఆషా 311:

వై-ఫై,

3.5జీ కనెక్టువిటీ,

టచ్‌స్ర్కీన్,

పోలరైజేషన్ ఫిల్టర్స్‌తో కూడిన 3 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ డిస్‌ప్లే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot