OPPO A9 2020: అదరహో అనిపించే ఫీచర్లతో ఒప్పో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్

|

స్మార్ట్‌ఫోన్ లను అందించడంలో ప్రతి ఒక్కరు తమ తమ ప్రతిభను ఎప్పుడు చూపుతూ ఉంటారు. ఒప్పో కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఆవిష్కరణ మరియు పనితీరు సరిహద్దులను పూర్తిగా మరింత అధిగమించింది. ఒప్పో ప్రత్యేకమైన షార్క్ ఫిన్ రైజింగ్ సెల్ఫీ కెమెరాతో ఫ్లాగ్‌షిప్ రెనో 2 సిరీస్‌ను ఆవిష్కరించిన తరువాత ఒప్పో ఇప్పుడు దాని సిరీస్‌లో సరికొత్త సమర్పణను ఆవిష్కరించింది. ఒప్పో A9 2020 అనేది ఒప్పో సంస్థ యొక్క కొత్త తరం స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకంగా యువతను ఆకట్టుకోవడానికి రూపొందించబడింది.

ఒప్పో A9 2020
 

ఒప్పో A9 2020 యొక్క వేరియంట్ 16,990 రూపాయలతో అందుబాటులోకి రానున్నది. మిడ్-రేంజ్ ధర విభాగంలో వస్తున్న ఒప్పో A9 2020 మంచి ఫీచర్లతో మరియు వినూత్న స్పెసిఫికేషన్ లతో తెస్తుంది. దీని హ్యాండ్‌సెట్ స్పెక్-షీట్ ద్వారా వస్తున్నందున ఒప్పో A9 2020 భారతీయ వినియోగదారులకు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒప్పో A9 2020 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫోటోగ్రఫీ

ఒప్పో సంస్థ స్మార్ట్‌ఫోన్‌ల రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఫోటోగ్రఫీ విషయంలో ప్రతి సారి తమని తామ మెరుగుపరచుకుంటు వస్తున్నారు. ఫోటోగ్రఫీ కోసం మునుపటిలాగ వెళ్లిన ప్రతిచోటుకు పెద్ద పెద్ద హై-ఎండ్ కెమెరాలను మోయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒప్పో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు మీ యొక్క జేబులో సరిపోయే విధంగా మరియు ఇమేజింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే కొన్ని హై-ఎండ్ కెమెరా సెన్సార్లతో నిండి ఉన్నాయి. ఒప్పో ప్రస్తుతం అందిస్తున్న ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

కెమెరాలు

కెమెరాలు

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇది ప్రస్తుతం అందరికి తెలిసిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో నిలువుగా అమర్చబడి ఉంటాయి. ఇందులో మొదటిది ప్రైమరీ కెమెరా 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు శామ్‌సంగ్ GM1 లెన్స్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రా-వైడ్ (119 డిగ్రీ) లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. దీని యొక్క వెనుక కెమెరాను "అల్ట్రా నైట్ మోడ్ 2.0" తో అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్‌కు AI మెటీఫికేషన్ మోడ్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా షూటర్ లభిస్తుంది.

 

కెమెరా ఫీచర్స్

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అల్ట్రా నైట్ మోడ్ 2.0 మోడ్‌తో వస్తుంది. ఇది తక్కువ కాంతి ఉన్నపుడు మరియు వాతావరణ పరిస్థితి అననుకూలంగా కూడా లేనప్పుడు వివరణాత్మక ఫోటోలను తీయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రీమియం రెనో 2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా లభిస్తుంది. ఇమేజింగ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి స్మార్ట్‌ఫోన్‌ EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ మరియు టచ్ టు ఫోకస్ ఫీచర్‌తో వస్తుంది.

అంతేకాకుండా ఫ్లాగ్‌షిప్ పరికరాల్లో ఇంతకు ముందు అందుబాటులో ఉన్న విభిన్న కెమెరా మోడ్‌లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పుడు ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో క్లిస్టమైన షాట్‌లను కూడా షూట్ చేయవచ్చు. స్లో-మోషన్ వీడియోలను కూడా సంగ్రహించవచ్చు. అంతేకాక మీరు వెనుక కెమెరాను ఉపయోగించి 1080p స్లో-మోషన్ వీడియోలను మరియు 30fps వద్ద 4K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. AI- సీన్ డిటెక్షన్ మద్దతుతో పరిసరాలను విశ్లేషించడం ద్వారా ఫోటో యొక్క నాణ్యతను మెరుగుపరచవచ్చు.

బ్యాటరీ

బ్యాటరీ

ఒప్పో అందిస్తున్న ఈ హ్యాండ్‌సెట్‌ యొక్క ముఖ్యమైన అంశాలలో బ్యాటరీ ఒకటి. బడ్జెట్‌తో పాటు మిడ్-రేంజ్ విభాగంలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఒప్పో దీని కంటే పెద్ద బ్యాటరీ యూనిట్‌ను అందిస్తోంది. ఒప్పో A9 2020 హ్యాండ్‌సెట్‌ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక్క ఛార్జీతో 20 గంటలకు పైగా బ్యాకప్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి రోజు మీరు మీతో పాటు ఛార్జర్‌ను తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక రోజు మొత్తం రన్ చేయడానికి కావలసిన ఛార్జింగ్ మీకు ఒప్పో బ్యాటరీ ఇస్తుంది.

డిస్ప్లే

డిస్ప్లే

స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మనమందరం చూసే మొదటి విషయం డిస్ప్లే. ఒప్పో ప్రస్తుతం మంచి రిజల్యూషన్‌తో పొడవైన డిస్ప్లేని అందిస్తోంది. దీని ద్వారా మనకు ఇష్టమైన కంటెంట్‌ను చాలా చక్కగా చూడవచ్చు. ఒప్పో సంస్థ ఎల్లప్పుడూ దీన్ని గుర్తుపెట్టుకొని మరి దాని యొక్క అన్ని స్మార్ట్‌ఫోన్‌ల కంటే మంచి నాణ్యమైన ప్యానెల్లను అందించింది. A9 2020 సంస్థ బాగా ప్యాక్ చేసిన హ్యాండ్‌సెట్‌ కూడా దీనికి మరొక ఉదాహరణ.

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల అతి పెద్ద HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది నానో-వాటర్‌డ్రాప్ స్క్రీన్‌ మద్దతును కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే పెద్దగా ఉండడం వలన సెల్ఫీ స్నాపర్‌ను చక్కగా కలిగి ఉంటుంది. డిస్ప్లే అద్భుతమైన 89% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఈ పెద్ద డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ ద్వారా పైన కవర్ చేయబడి ఉంటుంది. స్క్రీన్ స్పష్టంగా ఉంటుంది మరియు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అందువలన పగటి పూట సూర్యకాంతి వెలుగులో ఫోన్లో కంటెంట్‌ను చూడటానికి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. OPPO A9 2020 తో 'బ్లూ షీల్డ్' సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంది. ఇది రాత్రి సమయంలో సురక్షితమైన వీక్షణ అనుభవం కోసం హానికరమైన నీలి కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తుంది.

హార్డ్‌వేర్‌

ఒప్పో A9 2020 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు అయితే ఇది టాప్-ఆఫ్-ది-లైన్ హార్డ్‌వేర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ద్వారా హ్యాండ్‌సెట్‌కు శక్తిని ఇస్తుంది. చిప్‌సెట్‌తో పాటు 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లు ఉన్నాయి.

ప్రతి ఒక్కరు కోరుకునేది అదనపు మెమొరీ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్. ఇందులో 256GB వరకు మెమరీని విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇందులో మైక్రో SD కార్డుతో పాటు మీరు ఒకే సమయంలో డ్యూయల్ సిమ్ ను కూడా ఉపయోగించగలరు.

శక్తివంతమైన చిప్‌సెట్ మరియు ర్యామ్ ఉన్నందున PUBG మరియు లెజెండ్స్ వంటి గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ గేమ్ లను సజావుగా ఆడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫ్రేమ్ బూస్ట్ మరియు టచ్ బూస్ట్ లక్షణాన్ని ఉపయోగించి మీరు పరికరం యొక్క గేమింగ్ పనితీరును పెంచవచ్చు.

3D డిజైన్

3D డిజైన్

OPPO A9 2020 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన 3D గ్రేడియంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది నాలుగువైపుల వంగిన 3D షీట్లను వివిధ ఉష్ణోగ్రత రీడింగుల వద్ద కలపడం ద్వారా రూపొందించబడింది. ఫలితం ప్రత్యేకమైన నానో-స్కేల్ నమూనా. ఇది బహుళ-టోన్డ్ రేడియంట్ ముగింపును అందిస్తుంది. OPPO A9 2020 వేర్వేరు కోణాల్లో హ్యాండ్‌సెట్ వెనుక ప్యానెల్‌పై కాంతి పడినప్పుడు వేర్వేరు రంగు షేడ్‌లను ప్రతిబింబిస్తుంది. స్మార్ట్ఫోన్ స్పేస్ పర్పుల్ మరియు మెరైన్ గ్రీన్ అనే రెండు అద్భుతమైన రంగులలో లభిస్తుంది.

ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో ప్యాక్ చేసిన అన్ని ఫీచర్లు మరియు ఆవిష్కరణల కోసం OPPO A9 2020 మా నుండి 5 నక్షత్రాల రేటింగును పొందుతుంది. ఒక పరికరంలో పూర్తి వినోద ప్యాకేజీ కోసం చూస్తున్న వినియోగదారుల కోసం మీరు సెప్టెంబర్ 16 న అమెజాన్ నుండి A9 2020 మరియు సెప్టెంబర్ 19 నుండి ఆఫ్‌లైన్ స్టోర్లను కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్

ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్

ఒప్పో సంస్థ ఒప్పో A9 2020 తో పాటుగా ఒప్పో A5 2020 హ్యాండ్‌సెట్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ + మైక్రో SDతో కలిగిన స్లాట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ తో మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చ. OPPO A5 2020 కూడా స్నాపీ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత మద్దతు ఇవ్వబడింది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణతో అదే 6.5 "నానోవాటర్‌డ్రాప్హెచ్‌డి + స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

కెమెరాల విషయానికొస్తే ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్ 12MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 2MP మోనో లెన్స్ + 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కలిగి ఉన్న క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం ముందువైపు 8MP కెమెరా AI బ్యూటిఫికేషన్ సెన్సర్ తో వస్తుంది. ఇది కూడా బ్రహ్మాండమైన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్ మిరుమిట్లు గొలిపే వైట్ మరియు మిర్రర్ బ్లాక్ వంటి రెండు అద్భుతమైన రంగులలో లభిస్తుంది. దీని యొక్క ధర విషయానికి వస్తే దీని యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ ధర 13,990 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 21 నుండి అమెజాన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఉత్తేజకరమైన ఆఫర్లు

ఉత్తేజకరమైన ఆఫర్లు

ఒప్పో A9 2020 (8GB / 128GB)

• ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 2,000 / -

• ఏదైనా ఒప్పో ఫోన్ నుండి ఒప్పో A9 2020 కి అప్గ్రేడ్ చేయడానికి రూ. 2,500 / -

• 3 & 6 నెలలకు నో-కాస్ట్ EMI వర్తిస్తుంది.

• HDFC క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI పై 5% తక్షణ డిస్కౌంట్

ఒప్పో A9 2020 (4GB / 128GB)

• ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.1,500 / -

• ఏదైనా ఒప్పో ఫోన్ నుండి ఒప్పో A9 2020 కి అప్గ్రేడ్ చేయడానికి రూ. 2,000 / -

• 3 & 6 నెలలకు నో-కాస్ట్ EMI వర్తిస్తుంది.

• HDFC క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI పై 5% తక్షణ డిస్కౌంట్

ఒప్పో A5 2020 (4GB / 64GB)

• ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.1,500 / -

• ఏదైనా ఒప్పో ఫోన్ నుండి ఒప్పో A9 2020 కి అప్గ్రేడ్ చేయడానికి రూ. 2,000 / -

• 3 & 6 నెలలకు నో-కాస్ట్ EMI వర్తిస్తుంది.

• HDFC క్రెడిట్ / డెబిట్ కార్డ్ EMI పై 5% తక్షణ డిస్కౌంట్

Most Read Articles
Best Mobiles in India

English summary
oppo-A9-2020 Best Mainstream mid Range Smartphone in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X