Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??

|

రిలయన్స్ జియో గత నెలలో 2GB డైలీ డేటా బెనిఫిట్‌తో 'జియో డేటా ప్యాక్' అనే కొత్త ఉచిత డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. పరిమితకాల వ్యవధిలో ఈ ప్యాక్ మార్చి చివరిలో ఎటువంటి సమాచారం లేకుండా వినియోగదారుల అకౌంటుకు జమ చేయబడింది.

రిలయన్స్ జియో

ఇప్పుడు అదే ప్యాక్ మళ్ళి అదే డేటా ప్రయోజనంను వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నది. రిలయన్స్ జియో మళ్లీ నాలుగు రోజుల చెల్లుబాటుతో కొంతమంది వినియోగదారుల ప్రీపెయిడ్ అకౌంటుకు ‘జియో డేటా ప్యాక్' ను జమ చేస్తుంది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ ప్రస్తుత ప్యాక్ యొక్క డేటా ప్రయోజనం పైన 2GB అదనపు డేటాను వినియోగించటానికి అనుమతిస్తుంది.

జియో ప్రీపెయిడ్ యూజర్లు

జియో ప్రీపెయిడ్ యూజర్లు

జియో ప్రీపెయిడ్ యూజర్లు మైజియో మొబైల్ యాప్‌లోని ‘మై ప్లాన్స్' విభాగం కింద తమ మొబైల్ నంబర్‌లో జియో డేటా ప్యాక్ లభ్యత కోసం తనిఖీ చేయవచ్చు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కో ఏప్రిల్ 27 న జియో డేటా ప్యాక్‌కు జమ చేయడం ప్రారంభించింది.మీ ప్రీపెయిడ్ అకౌంటులో క్రెడిట్ చేసిన దాన్ని బట్టి దీని యొక్క గడువు రోజు మే 1 లేదా మే 2 లేదా మే 3 అవుతుంది.

జియో డేటా ప్యాక్ ప్రయోజనాలు

జియో డేటా ప్యాక్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో గతంలో 2017 లో తన మొదటి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అప్పటి నుండి కంపెనీ మూడు నెలల పాటు 8GB మొత్తం డేటా ప్రయోజనాన్ని ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు ప్రీపెయిడ్ వినియోగదారులకు మళ్ళీ అదే ఆఫర్ ను ముందుకు తీసుకువచ్చింది.

జియో డేటా ప్యాక్

జియో డేటా ప్యాక్

జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రోజుకు 2GB ఉచిత డేటాను ‘జియో డేటా ప్యాక్' కింద పొందుతున్నారు. ప్యాక్ యాదృచ్ఛిక ప్రాతిపదికన జియో అకౌంటులకు జమ అవుతోందని గమనించండి. కాబట్టి అవి మీకు లభించకపోవచ్చు. మీరు నా జియో యాప్ ద్వారా జియో డేటా ప్యాక్ లభ్యత కోసం తనిఖీ చేయవచ్చు.

జియో డేటా ప్యాక్ చెల్లుబాటు

జియో డేటా ప్యాక్ చెల్లుబాటు

రిలయన్స్ జియో అందిస్తున్న ఇతర వివరాల విషయానికొస్తే కొంతమందికి ఏప్రిల్ 27 న మరియు మరి కొంతమందికి ఏప్రిల్ 28 న క్రెడిట్ చేయడం ప్రారంభించింది. దీని యొక్క చెల్లుబాటు క్రెడిట్ తేదీ నుండి నాలుగు రోజులు అంటే మే 1 లేదా మే 2 వరకు ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఈ రోజు కూడా జియో డేటా ప్యాక్ ప్రయోజనాన్ని పొందుతున్నారు కాబట్టి దీని యొక్క చెల్లుబాటు మే 3 వరకు ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో జియో కస్టమర్లు తమ ప్రస్తుత ప్లాన్ యొక్క డేటా ప్రయోజనం పైన రోజుకు 2GB డేటాను అదనంగా వినియోగించవచ్చు. ఉదాహరణకు మీరు రోజుకు 1.5GB డేటాను అందించే 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉంటే కనుక మీరు Jio డేటా ప్యాక్ యొక్క చెల్లుబాటు సమయంలో రోజుకు మొత్తం 3.5GB డేటాను వినియోగించవచ్చు.

రిలయన్స్ జియో వర్క్ @ హోమ్ ప్లాన్ లు

రిలయన్స్ జియో వర్క్ @ హోమ్ ప్లాన్ లు

రిలయన్స్ జియో సంస్థ ‘జియో డేటా ప్యాక్' ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో అదే ప్యాక్ వినియోగదారుల అకౌంటులకు జమ చేసింది. రిలయన్స్ జియో చందాదారులకు ఉచిత డేటాను అందించడానికి కారణం ఇంటి వద్ద నుండి పని చేస్తున్న వారిని ప్రోత్సహించడం మరియు ఈ కఠినమైన కాలంలో వినియోగదారులను కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయడం. ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండవచ్చు మే 3 వరకు భారతదేశం పూర్తి లాక్డౌన్లో ఉంది. దేశంలో కరోనావైరస్ సానుకూల కేసులు ఇప్పటికి వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.కావున ఇండియాలో లాక్ డౌన్ మళ్ళి పెరిగే అవకాశాలు ఉన్నాయి. టెల్కో ఇప్పటికే జియోఫోన్ వినియోగదారులకు ఉచిత ప్రయోజనాలను అందిస్తోంది. ఇది అన్ని JioFiber ప్లాన్‌లపై డబుల్ డేటాను షిప్పింగ్ చేయడంతో పాటు అదనపు ఖర్చు లేకుండా 10 Mbps JioFiber ప్లాన్‌ను అందించడం ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
Reliance Jio Data Pack Offers 8GB Free Data Benefit For Prepaid Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X