JioMart: వాట్సాప్ తోనే ఆన్‌లైన్ షాపింగ్....రూ.3000 వరకు ఆదా చేసే అవకాశం..

|

ముఖేష్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియో సంస్థలో ఫేస్బుక్ సంస్థ సుమారు 5.7 బిలియన్ డాలర్లు (రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టిన మూడు రోజుల తరువాత రిలయన్స్ తన ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను పరీక్షించడం ప్రారంభించింది.

జియోమార్ట్

రిలయన్స్ రిటైల్ యొక్క ఇ-కామర్స్ వెంచర్ అయిన జియోమార్ట్ ప్రస్తుతం ట్రయిల్ వెర్షన్ లలో భాగంగా ముంబై చుట్టుపక్కల ఉన్న మూడు పరిసరాల్లో పరీక్షించడానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ప్రపంచంలో అత్యంత విస్తృతమైన జనాభా గల భారతదేశంలోని వాట్సాప్ యొక్క 400 మిలియన్ల వినియోగదారులకు యాక్సిస్ ను ఇస్తుంది.

ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్

ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్

జియోమార్ట్ పోర్టల్ ప్రారంభించడంతో ఆసియా ఖండంలోని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్‌కు గట్టి పోటీని ఇవ్వడానికి ఏర్పాటు చేయాలనే తన లక్ష్యానికి ఒక అడుగు దగ్గరగా వచ్చింది. భారత ఇ-కామర్స్ మార్కెట్లో వాల్మార్ట్ యొక్క ఫ్లిప్ కార్ట్ 2027 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కెపిఎంజి అంచనాలు వేస్తున్నాయి. చిన్న వ్యాపారాలు వినియోగదారులతో కనెక్ట్ అయ్యే ప్రాధమిక మార్గంగా వాట్సాప్ చేయడానికి జియోమార్ట్ తో భాగస్వామ్యం సహాయపడుతుందని ఫేస్బుక్ భావిస్తోంది.

జియోమార్ట్ ఆన్‌లైన్‌ ఆర్డర్‌లు

జియోమార్ట్ ఆన్‌లైన్‌ ఆర్డర్‌లు

రిలయన్స్ యొక్క అన్ని రకాల సేవలు లక్షలాది చిన్న తరహా వ్యాపారాలు మరియు కిరణా దుకాణాలలో దూసుకుపోయింది. వినియోగదారులకు వాట్సాప్ ద్వారా అవసరమైన వస్తువుల కోసం ఆర్డర్ ఇవ్వడానికి ఇది వీలు కల్పిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం భారతదేశంలో 400 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. సరళంగా చెప్పాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు ఇవ్వడానికి కానీ స్టోర్‌లో చెల్లించడానికి వినియోగదారులను అనుమతించే ఆఫ్‌లైన్ వ్యాపార వేదిక రియోలెన్స్ ఆన్‌లైన్ జియోమార్ట్.

JioMart లో ఆర్డర్ ఎలా ఇవ్వాలి

JioMart లో ఆర్డర్ ఎలా ఇవ్వాలి

*** జియోమార్ట్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి వినియోగదారులు వారి యొక్క ఫోన్ లోని కాంటాక్ట్ లలో జియోమార్ట్ యొక్క వాట్సాప్ నంబర్ 88500 08000 ను సేవ్ చేసుకోవాలి.


*** ఈ నెంబర్ ను సేవ్ చేసుకున్న తరువాత వినియోగదారులు JioMart నంబర్‌కు "హాయ్" అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.


*** జియోమార్ట్ షాపింగ్ లింక్‌తో పాటు "జియోమార్ట్ వాట్సాప్ ఆర్డర్ బుకింగ్ సర్వీసుకు స్వాగతం" అనే మెసేజ్ తో మీకు ప్రత్యుత్తరం ఇస్తుంది. ఈ షాపింగ్ లింక్ కేవలం 30 నిమిషాలు మాత్రమే యాక్టీవ్ గా ఉంటుంది. క్రొత్త లింక్‌ను రూపొందించడానికి కస్టమర్ మళ్ళి మరొక "హాయ్" అనే మెసేజ్ పంపవలసి ఉంటుంది.

*** మీరు లింక్‌ను ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, ప్రాంతం మొదలైన మీ వ్యక్తిగత వివరాలను అడిగే పేజీకి మళ్ళించబడతారు.

*** వివరాలను నమోదు చేసి "సబ్మిట్" బటన్ మీద నొక్కండి.

*** తరువాత పేజీలో కిరాణా వస్తువులను జాబితా చేయబడిన కొత్త పేజీ కనిపిస్తుంది. మీరు మీకు కావలసిన వస్తువులను ఎంచుకోవచ్చు.

*** మీరు ఆర్డర్‌ను పూర్తి చేసిన తర్వాత జియోమార్ట్ కిరాణా షాప్ చిరునామా మరియు గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ప్రదేశంతో పాటు ఇన్‌వాయిస్ పంపుతుంది.

*** పోస్ట్, ఆర్డర్ సిద్ధంగా ఉన్నప్పుడు కస్టమర్ స్టోర్ నుండి SMS అందుకుంటారు. మీరు స్టోర్ వద్దకు వెళ్లి అక్కడ నుండి ఆర్డర్ ను తీసుకొని అక్కడే డబ్బులను పే చేయవచ్చు.


*** వినియోగదారులు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు తమ ఆర్డర్‌లను ఇవ్వాలి. తద్వారా మీ యొక్క సమీప కిరాణా దుకాణం రాబోయే రెండు రోజుల్లో వాటిని సిద్ధంగా ఉంచబడుతుంది. ప్రస్తుతానికి కనీస లేదా గరిష్ట పరిమితి లేదు.

 

జియోమార్ట్ ప్రీ-రిజిస్టేషన్

జియోమార్ట్ ప్రీ-రిజిస్టేషన్

జియోమార్ట్ లో ఇప్పుడు రిజిస్టేషన్ చేసుకోవడం వలన మీకు సుమారు రూ.3000 వరకు ఆదా చేయవచ్చు. ప్రస్తుతం ముంబయి ప్రాంతంలో మాత్రమే ప్రారంభమైన ఈ సర్వీస్ త్వరలో ఇండియా అంతటా ప్రారంభం కానున్నది. ఇప్పుడు ప్రీ- రిజిస్టేషన్ చేసుకోవడం ద్వారా తరువాత మీరు చేసే షాపింగ్ మీద డబ్బును ఆదా చేయవచ్చు. ఇటువంటి గొప్ప అవకాశం మళ్ళి మళ్ళి రాదు కాబట్టి పెంటనే త్వరపడండి.

ఫేస్‌బుక్ జియో పెట్టుబడులు

ఫేస్‌బుక్ జియో పెట్టుబడులు

ఫేస్‌బుక్ జియో ప్లాట్‌ఫామ్‌లలో 5.7 బిలియన్ డాలర్ల (రూ. 43,574) కోట్లు పెట్టుబడి పెట్టింది. సోషల్ మీడియా దిగ్గజం సంస్థలో 9.99% ఈక్విటీ వాటాను పూర్తి ప్రాతిపదికన కొనుగోలు చేసింది. ఇది సోషల్ మీడియా దిగ్గజం జియో యొక్క అతిపెద్ద మైనారిటీ వాటాదారుని చేస్తుంది.

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ఫేస్‌బుక్ మరియు రిలయన్స్ మధ్య వ్యాపార ఒప్పందం గురించి మాట్లాడిన ముఖేష్ అంబానీ ఇది "డిజిటల్ ఇండియా" కి సహాయపడుతుందని అన్నారు. "జియో మరియు ఫేస్‌బుక్‌ల మధ్య సినర్జీ డిజిటల్ ఇండియా మిషన్‌ను ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మినహాయింపు లేకుండా అనే రెండు ప్రతిష్టాత్మక లక్ష్యాలతో సాకారం చేస్తుంది. కరోనా అనంతర కాలంలో అతి తక్కువ వ్యవధిలో ఇండియాలోని అన్ని చోట్ల కూడా జియోమార్ట్ షాపింగ్ అందుబాటులోకి రానున్నది.

Best Mobiles in India

English summary
JioMart WhatsApp-Based Online Shoping Started in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X