మొబైల్ టారిఫ్ పెంపు తరువాత లాభపడిన టెల్కో ఎవరు?

|

గత సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో దేశంలోని టెలికామ్ కంపెనీలు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా మరియు రిలయన్స్ జియో ముగ్గురు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క సుంకాలను పెంచారు. గత మూడేళ్లలో తొలిసారిగా మూడు కంపెనీలు 14 నుంచి 33 శాతం వరకు వారి యొక్క ధరల పెంపును ప్రకటించాయి.

డేటా ఛార్జీ

మొబైల్ కాలింగ్ మరియు డేటా ఛార్జీల పెరుగుదల మూడు టెలికాం కంపెనీల మీద చాలా వరకు ప్రభావితం చేసింది. ఇది టెలికాం కంపెనీల యొక్క వినియోగదారుల సంఖ్య పడిపోవడానికి అధిక మొత్తంలో దారితీసింది. వినియోగదారుల యొక్క చేరికలలో ఏ సంస్థ పెరుగుదలను చూసింది మరియు ఏ సంస్థ దారుణంగా పడిపోయింది వంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!Airtel Digital TV: మల్టీ టీవీ ధరలను పెంచిన airtel,కొత్త ధరలు ఇవే!

జియో

జియో

ఇండియాలో మూడు సంవత్సరాల కిందట ప్రారంభమైన సరికొత్త టెలికాం సంస్థ రిలయన్స్ జియో 2019 డిసెంబర్ నెలలో టారిఫ్ పెంపు తరువాత చందాదారుల చేరికలో కూడా గణనీయమైన తగ్గుదలను చవిచూసినట్లు ట్రాయ్ డేటా తెలిపింది.

 

 

Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లుJio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

జియో వినియోగదారుల సంఖ్య
 

జియో వినియోగదారుల సంఖ్య

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మొదటి సారిగా డిసెంబరులో కేవలం 82,308 మొబైల్ వినియోగదారులను మాత్రమే చేర్చింది. డిసెంబరులో వీరి చేరికతో వినియోగదారుల సంఖ్య 370 మిలియన్లను దాటింది. ఇది అంతకు ముందు నెలల్లో మిలియన్ల సంఖ్యలో వినియోగదారులను చేర్చుకునేది.

 

Tata Sky హిట్స్ వాల్యూ-యాడెడ్ సర్వీస్: ప్రత్యేక హాలీవుడ్ షోల కోసంTata Sky హిట్స్ వాల్యూ-యాడెడ్ సర్వీస్: ప్రత్యేక హాలీవుడ్ షోల కోసం

చందాదారుల చేరిక

చందాదారుల చేరిక

2019 డిసెంబర్ నెలలో రిలయన్స్ జియో యొక్క చందాదారుల చేరికలు గణనీయంగా తగ్గిపోయింది. ఇది అక్టోబర్ మరియు నవంబర్‌లలో వరుసగా 9.1 మిలియన్లు మరియు 5.6 మిలియన్ల కస్టమర్-యాడ్‌లను పొందినట్లు కంపెనీ నివేదించింది.

 

 

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలుAirtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలు

 

టారిఫ్ పెంపు ప్రభావం

టారిఫ్ పెంపు ప్రభావం

మిగతా రెండు టెలికాం కంపెనీల మాదిరిగానే రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌ను డిసెంబర్‌లో పెంచింది. అక్టోబర్ చివరలో సంస్థ ఉచిత వాయిస్ కాల్‌లను కూడా ఉపసంహరించుకుంది మరియు వినియోగదారుల నుండి ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్‌ల కోసం ఇంటర్‌కనెక్ట్ వినియోగ ఛార్జీలను (ఐయుసి) వసూలు చేసే నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.

 

 

Redmi K30 Pro 5G: కొత్త ఫోన్ ఫీచర్స్ ఇవే...Redmi K30 Pro 5G: కొత్త ఫోన్ ఫీచర్స్ ఇవే...

జియో

రిలయన్స్ జియో ప్రారంభమైనప్పటి తరువాత ఐదు మిలియన్ల కంటే తక్కువ వినియోగదారులను చేర్చుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే రెండు త్రైమాసికాలలో 500 మిలియన్ల చందాదారుల సంఖ్యను చేరుకోవాలనే జియో లక్ష్యంపై ఇప్పుడు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే వొడాఫోన్ ఐడియా ఈ నెలలో అత్యధిక మంది సభ్యులను కోల్పోయింది. తరువాత భారతి ఎయిర్‌టెల్ మరియు ఎమ్‌టిఎన్ఎల్ ఉన్నాయి.

 

 

సినిమాలలో విలన్లు ఆపిల్ ఐఫోన్లు వాడరు!!! ఎందుకో తెలుసా?సినిమాలలో విలన్లు ఆపిల్ ఐఫోన్లు వాడరు!!! ఎందుకో తెలుసా?

వోడాఫోన్ ఐడియా & ఎయిర్‌టెల్

వోడాఫోన్ ఐడియా & ఎయిర్‌టెల్

2019 డిసెంబర్‌లో సుమారు 3.6 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయి వోడాఫోన్ ఐడియా యొక్క పరిస్థితి మరింత దిగజారింది. భారతి ఎయిర్‌టెల్ కూడా 2019 చివరి నెలలో 11,000 మంది సభ్యులను కోల్పోయింది. కాబట్టి భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాపై కూడా సుంకం పెంపు ప్రభావాన్ని చూడవచ్చు. నవంబర్ 2019 లో వోడాఫోన్ ఐడియా 30 మిలియన్లకు పైగా కస్టమర్లను కోల్పోయింది. ఇది మొత్తం వినియోగదారుల సంఖ్యను గణనీయమైన తేడాతో తగ్గించింది. మరియు టెల్కోకు చందాదారుల నష్టాలు కొనసాగుతున్నాయి.

మార్కెట్ వాటా

మార్కెట్ వాటా

మొత్తం విషయానికొస్తే రిలయన్స్ జియో ఇప్పటికీ 32.14% మార్కెట్ వాటాతో భారతదేశంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ లలో మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో వోడాఫోన్ ఐడియా 28.89%, భారతి ఎయిర్టెల్ 28.43% మార్కెట్ వాటాతో నిలిచాయి. బిఎస్ఎన్ఎల్ 10.26% మార్కెట్ వాటాతో భారతదేశం యొక్క నాల్గవ అతిపెద్ద టెల్కోగా కొనసాగుతోంది.

Best Mobiles in India

English summary
Mobile Tariff Hike Impact : Which company Gain and Which One Loss

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X