Vodafone Rs.129 ప్లాన్‌తో ఇప్పుడు మరిన్ని ప్రయోజనాలు....

|

వోడాఫోన్ టెలికామ్ సంస్థ తన వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను మెరుగుపరుస్తున్నది. వోడాఫోన్ కొత్తగా రూ.499 ప్లాన్‌ను ప్రవేశపెట్టిన తరువాత రూ.555 రీఛార్జి ప్లాన్‌ను సవరించింది. ఇప్పుడు మళ్ళి కొత్తగా మరొక కొత్త మార్పును జోడించింది. ఈ టెల్కోలోని ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.129 రీఛార్జి ప్లాన్‌ యొక్క చెల్లుబాటును ఇప్పుడు సవరించింది.

వోడాఫోన్

వోడాఫోన్ యొక్క ఎంట్రీ లెవల్ రూ.129 ప్లాన్ కొత్త సవరణ పొందిన తరువాత ఇప్పుడు 24 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు లభిస్తుంది. ఈ ప్లాన్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో 14 రోజుల చెల్లుబాటుతో ప్రారంభమయింది. వోడాఫోన్ రూ.129 ప్లాన్‌ కొత్త సవరణ జియో యొక్క సరసమైన రూ.98 ప్యాక్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టింది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కారణంగా రేసులో ముందువరుసలో ఉంది.

 

Galaxy S20, S20+, 5G Support ఫోన్‌లు ఎలా ఉన్నాయో లుక్ వేసుకోండి!!!!Galaxy S20, S20+, 5G Support ఫోన్‌లు ఎలా ఉన్నాయో లుక్ వేసుకోండి!!!!

వాయిస్ కాలింగ్‌
 

మరోవైపు జియో రూ.98 ప్లాన్‌తో ఉచిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఆఫ్-నెట్ కాల్స్ కోసం IUC టాప్-అప్స్‌ను ఉపయోగించుకోవాలి. వోడాఫోన్ యొక్క రూ.129 రీఛార్జ్ కొత్త సవరణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ మరియు ముంబై వంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

 

Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...

వోడాఫోన్ రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

వోడాఫోన్ రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

ఇండియాలోని మూడు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో వోడాఫోన్ అత్యధిక ఆఫర్‌లతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇది రోజు రోజుకి ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాను పెంచుతోంది. వోడాఫోన్ 14 రోజుల చెల్లుబాటుతో కొన్ని నెలల క్రితం రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జిని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ప్లాన్ ను ముంబై, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వంటి ఎంపిక చేసిన సర్కిళ్లలో 24 రోజుల చెల్లుబాటుతో మరియు రాజస్థాన్‌లో 21 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తోంది. కొన్ని సర్కిల్‌లలో ఈ ప్లాన్ ఇప్పటికీ 14 రోజుల యాక్సిస్ ను అందిస్తోంది. అయితే సంస్థ త్వరలో 24 రోజుల పాటు యాక్సిస్ ను అందించడానికి దాన్ని సవరించవచ్చు.

 

 

iQOO 5G smartphone : ప్రీమియం విభాగంలో తక్కువ ధరతో మిగిలిన వారికి పోటీగా....iQOO 5G smartphone : ప్రీమియం విభాగంలో తక్కువ ధరతో మిగిలిన వారికి పోటీగా....

ప్రయోజనాలు

ప్రయోజనాలు

వోడాఫోన్ యొక్క రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, 300SMSలు మరియు 2GB డేటా వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే 999 రూపాయల విలువైన వోడాఫోన్ ప్లే యాప్‌కు యూజర్లు ఉచిత యాక్సెస్ పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం వలన కలిగే ప్రధాన ప్రయోజనం అపరిమిత వాయిస్ కాలింగ్. 24 రోజుల పాటు వినియోగదారులు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్‌లను చేయవచ్చు. ఇందులో ఎటువంటి FUP పరిమితి అమలులో లేదు.

 

 

Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...

వొడాఫోన్ రూ.129 ప్లాన్ vs జియో రూ.98 రీఛార్జ్ ప్లాన్

వొడాఫోన్ రూ.129 ప్లాన్ vs జియో రూ.98 రీఛార్జ్ ప్లాన్

వోడాఫోన్ రూ.129 ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే రిలయన్స్ జియో తన ఎంట్రీ లెవల్ రూ.98 ప్రీపెయిడ్ ప్యాక్‌ను 2GB 4G డేటా, 300SMSలు మరియు అపరిమిత జియో టు జియో వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలతో తన పోర్ట్ ఫోలియోలో ప్రవేశపెట్టింది. జియో తన రూ .98 ప్లాన్‌తో ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందించడం లేదు. వినియోగదారులు ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయడానికి రూ.10, రూ.20, రూ.50 వంటి IUC టాప్-అప్‌లను రీఛార్జ్ చేసుకోవాలి. రిలయన్స్ జియోలో రూ.129 ప్లాన్ కూడా ఉంది. ఇది 2GB మొబైల్ డేటా, 300SMS లు, 1,000 నాన్-జియో నిమిషాలు మరియు అపరిమిత జియో టు జియో కాల్స్ తో 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Rs.129 Prepaid Plan Validity Increased

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X