నేడే ‘ఇంజినీర్స్ డే’
భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 -1962) జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టంబర్ 15వ తేదీన జాతీయ ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజినీర్‌గాను, పాలనాదక్షునిగా ఎంతో కీర్తిని సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 సంవత్సరాల పాటు అపారమైన సేవలనందించిన విశ్వేశ్వరయ్య దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు.
Read More : లెనోవో ఏ7000 ప్లస్ విడుదల

1884లో పూణే సైన్స్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసుకున్న విశ్వేశ్వరయ్య నేరుగా గవర్నమెంట్ ఆఫ్ బోంబే (ఇప్పటి ముంబై) ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియామకమయ్యారు. ఆ తరువాత భారత నీటిపారుదల కమీషన్ విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఈయన రూపొందించిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను 1903లో మొదటిసారిగా పూణే దగ్గర ఖడక్ వాస్లా వద్ద నెలకొల్పారు.
Read More : మతి పోగొడుతున్న శ్యాంసంగ్ డిస్కౌంట్లు
వరద సమయంలో ఆనకట్ట భద్రను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ విధానానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. ఆ తరువాత గ్వాలియర్‌లోని అలతిగ్రా వద్ద మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోనూ ఈ ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఉపయోగించారు.
Read More : కొత్త ఐఫోన్ రికార్డుల మోత!
1908లో మూసి నదికి వరద రావడంతో హైదరాబాద్ నగరం ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వర్యను ఆహ్వానించి సమస్యకు పరిష్కారం వెతకాలని కోరటంతో పటిష్టమైన నగర మురుగునీటి పారుదల పథకాన్ని విశ్వేశ్వర్య రూపొందించారు.
Read More : నీ సెల్ఫీ అదిరిందయ్యా గణేశా..
ఆ తరువాత మూసీ, ఈసీ నదుల పై రిజర్వాయర్లను నిర్మించటంతో హైదరాబాద్ నగరానికి వరద ప్రమాదం తప్పింది. విశేఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య పాత్ర ఉంది. 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించడంలోనూ విశ్వేశ్వరయ్య ప్రముఖ పాత్ర పోషించారు.
Read More : స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
1908లో స్వఛ్చంద పదవీ విరమణ అనంతరం మైసూర్ సంస్థానంలో దివానుగా కృషి చేసిన విశ్వేశ్వరయ్యకు బ్రిటీషు ప్రభుత్వం నైట్‌హుడ్ (సర్) బిరుదు ఇచ్చింది. 1955లో భారద దేశపు అత్యంత గొప్ప పురస్కారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వరించింది.


Click it and Unblock the Notifications