జర్ర... చూడు చూడు మెహబూబా!!

Posted By: Prashanth

జర్ర... చూడు చూడు మెహబూబా!!

 

ఎట్టకేలకు వాకామ్ కంపెనీ గ్రాఫిక్ టాబ్లెట్‌లను లాంఛ్ చేసింది. స్మాల్ (4 x 6అంగుళాలు) , మీడియం (6 x 8అంగుళాలు) , లార్జ్ ( 13 x 8అంగుళాల) సైజ్ వేరియంట్‌లలో ఇవి లభ్యం కానున్నాయి. చదునైన ఆక్ళతిలో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ కంప్యూటర్లను ప్రత్యేకంగా రూపొందించిన వాకామ్ పెన్‌తో ఆపరేట్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ పీసీలను ప్రత్యేకించి ఫోటోగ్రాఫర్లు, డిజిటల్ కళాకారులు, డిజైనర్ల కోసం రూపొందించారు. ఫోటోషాప్, పెయింటింగ్, డిజిటల్ ఎడిటింగ్, డిజిటల్ స్ర్కాప్ బుకింగ్, డిజిల్ ఆర్ట్ వంటి అంశాలను ఈ డివైజ్ ద్వారా సమర్దవంతంగా నిర్వహించుకోవచ్చు. పెయింటర్ అవసరాలకు కావలిసిన టూల్స్, ఫోటోషాప్ మూలకాలు, పెయింట్ షాప్ ప్రో వంటి వ్యవస్థలను ఈ పీసీలో నిక్షిప్తం చేశారు. వీటి ధరలను పరిశీలిస్తే వామ్ కామ్ టాబ్లెట్ చిన్న సైజ్ ధర రూ.10,000, మీడియం సైజ్ ధర రూ.16,500, పెద్ద సైజ్ ధర రూ.21,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot