18 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో Amazfit Band 7 స్మార్ట్ బ్యాండ్ విడుద‌ల‌!

|

Amazfit కంపెనీ గ్లోబ‌ల్ మార్కెట్‌కు స‌రికొత్త బ్యాండ్‌ను ప‌రిచ‌యం చేసింది. దాదాపు 120 స్పోర్ట్స్ మోడ్ క‌లిగిన Amazfit Band 7 ను తాజాగా విడుద‌ల చేసింది. Amazfit నుంచి విడుద‌లైన ఈ కొత్త మోడ‌ల్ బ్యాండ్‌, Xiaomi కంపెనీ ఇటీవల విడుద‌ల చేసిన‌ Mi బ్యాండ్ 7 ప్రో ని పోలి ఉంటుంది. కానీ, దీనికి ఇన్‌బిల్ట్ జీపీఎస్ స‌పోర్ట్ అందించ‌డం లేదు. ఈ Amazfit Band 7 మోడ‌ల్‌ 1.47- అంగుళాల‌ HD AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఇది 24|7 హార్ట్ రేట్, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ మానిట‌రింగ్‌తో పాటు ప‌లు అద్భుతమైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతానికి ఇది భార‌త్‌లో అందుబాటులో లేదు. భార‌త మార్కెట్‌లో ఇది ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌నే దానిపై ఇంకా కంపెనీ నుంచి స‌మాచారం లేదు. ఇప్పుడు ఈ బ్యాండ్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, స్పెసిఫిక‌ష‌న్ల గురించి తెలుసుకుందాం.

 
18 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో Amazfit Band 7 స్మార్ట్ బ్యాండ్ విడుద‌ల‌!

Amazfit Band 7 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
Amazfit Band 7 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 198 x 368 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.47-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనికి Zepp ఓఎస్ అందిస్తున్నారు. నావిగేష‌న్ కోసం దీనికి కుడి వైపున ఒక బ‌ట‌న్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్ల‌డ్ ఆక్సిజ‌న్‌,హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది. ఈ వాచ్ 120 స్పోర్ట్స్ మోడ్‌ల‌ను క‌లిగి ఉంటుంది. స్ట్రెస్ మానిట‌రింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ల‌ను కూడా అందిస్తున్నారు.

ఇది ఒక‌సారి ఫుల్ చార్జ్ చేయ‌డం ద్వారా 18 రోజుల పాటు బ్యాట‌రీ లైఫ్ ఇస్తుంది. ఇది IP68-రేటెడ్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. Amazfit బ్యాండ్ 7ను బ్లూటూత్ ద్వారా Android మరియు iOS పరికరాలతో కూడా జత చేయవచ్చు. ఆండ్రాయిడ్ 7.0 మరియు అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే డివైజ్‌లు లేదా iOS 12.0 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న Apple ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవ‌చ్చు. ఇంకా, ఇది ఇన్‌బిల్ట్‌ Amazon Alexa వాయిస్ స‌పోర్ట్‌ కలిగి ఉంది.

18 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో Amazfit Band 7 స్మార్ట్ బ్యాండ్ విడుద‌ల‌!

Amazfit బ్యాండ్ 7 యొక్క ఇతర ఫీచర్లలో సెడెంటరీ రిమైండర్, ఫైండ్ మై ఫోన్, అలారం క్లాక్, స్టాప్‌వాచ్, డు నాట్ డిస్ట‌ర్బ్ మోడ్‌, ఫోన్ కాల్ నోటిఫికేషన్‌లు, SMS నోటిఫికేషన్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇది 5 ATM యొక్క నీటి-నిరోధక రేటింగ్‌తో వస్తుంది.

భార‌త మార్కెట్లో ఈ బ్యాండ్‌ ధ‌ర‌లు:
ఈAmazfit Band 7 ధ‌ర‌ను కంపెనీ 49.99 డాల‌ర్లు (రూ.3,650)గా కంపెనీ నిర్ణ‌యించింది. అమెజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతానికి ఇది భార‌త్‌లో అందుబాటులో లేదు. భార‌త మార్కెట్‌లో ఇది ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌నే దానిపై ఇంకా కంపెనీ నుంచి స‌మాచారం లేదు. ఇది నీలం, ఆకుపచ్చ, నారింజ మరియు పింక్ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది.

18 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో Amazfit Band 7 స్మార్ట్ బ్యాండ్ విడుద‌ల‌!

ఇటీవ‌ల Xiaomi కంపెనీ నుంచి విడుద‌లైన Xiaomi Mi Band 7 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌పై కూడా ఓ లుక్కేద్దాం:
Mi Smart Band 7 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ Mi Smart Band 7 1.64 అంగుళాల రెక్టాంగ్యులర్ ఆకారంలో AMOLED (280x456 pixels) డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ మంచి ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఎల్ల‌ప్పుడూ టైమ్, డేట్ తెలుసుకునేలా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మోడ్ క‌లిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ సాటిలైట్ పోజిష‌నింగ్ తో పాటుగా, జీపీఎస్ స‌పోర్ట్ క‌లిగి ఉంది.

 

ఈ బ్యాండ్‌ 14 ప్రొఫెష‌న‌ల్ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు, 117 ఎక్స‌ర్‌సైజ్ మోడ్స్‌ను క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగాహెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది.ఇది 235mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ సెట‌ప్ తో వ‌స్తోంది. ఈ బ్యాండ్ కు ఒక్క‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా 12 రోజుల బ్యాట‌రీ లైఫ్ వ‌స్తుందని కంపెనీ తెలిపింది. ప్ర‌స్తుతం ఈ Mi Smart Band 7 Pro చైనాలో కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది. చైనాలో దీని ధ‌ర CNY 399 గా నిర్ణ‌యించారు. భార‌త్‌లో దాదాపు రూ.4700 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Amazfit Band 7 With 18 Days Battery Life, 120 Sports Modes Launched: Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X