ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 6 సూత్రాలు!

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 6 సూత్రాలు!
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..?, వారంటీ ఎంతకాలముండాలి..? తదితర విషయాల పట్ల అవగాహన కలిగించేందుకు గిజ్‌బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తెచ్చింది.

ర్యామ్ (512ఎంబి ఇంకా అధిక సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి):

మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన పనితీరును కరబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ బెస్ట్ ఛాయిస్. ప్రతస్తు మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే ఎల్‌జీ ఇంకా సామ్‌సంగ్‌లు 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

ప్రాసెసర్ (1గిగాహెట్జ్ ఇంకాసామర్ధ్యాన్ని కలిగి ఉండాలి):

స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లో, ర్యామ్ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది ప్రాసెసర్. ప్రస్తుత ట్రెండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ల పై నడుస్తోంది. అయితే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌లను ఎంపిక చేసుకోవచ్చు.

వారంటీ (సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఉండాలి):

స్మార్ట్‌ఫోన్ ఎంపికలో వారంటీ ఎంతో అవసరం. సంవత్సరం అంతకన్నా ఎక్కువ కాలం వారంటీ ఆప్షన్‌లతో లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఇంకా తరువాతి వర్షన్):

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆపరేటింగ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.1' ప్రస్తుత లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం. ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోదలచినట్లియితే ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఇంకా ఆపై వర్షన్
ప్లాట్‌ఫామ్‌లతో ఉన్న డివైజ్‌ను ఎంపిక చేసుకోండి.

కెమెరా (5 మెగా పిక్సల్ అంతక్నా ఎక్కువ స్థాయి):

స్మార్ట్‌ఫోన్ అంటే తప్పనిసరిగా కెమెరా ఆప్షన్ ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ రేర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఇంకా ఆపై సామర్ధ్యాన్ని కలిగి ఉంటే మంచిది. ప్రంట్ కెమెరా ఉండటం వల్ల వీడియో కాలింగ్ సాధ్యమవుతుంది.

ఆ అంశాలను నిశితంగా పరిశీలించిండి:

మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్, బరువు, స్ర్కీన్ బ్రైట్‌నెస్, కలర్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఇంటర్‌ఫేస్, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ వంటి అంశాల పట్ల స్పష్టమైన అవగాహనికి వచ్చిన తరువాత సదరు డివైజ్‌ను కొనుగోలు చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot