మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ మొట్టమొదటి పుష్ - మెయిల్ ఫోన్‌

Posted By: Staff

మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ మొట్టమొదటి పుష్ - మెయిల్ ఫోన్‌

భారతీయ మొబైల్ మార్కెట్లోకి సరికొత్త పుష్‌ ఈమెయిల్‌ ఫోన్‌ వచ్చింది.. 'మైక్రోమ్యాక్స్‌ క్యూ 80'ని మైక్రోమ్యాక్స్‌ కంపెనీ బుధవారం దీనిని విడుదల చేసింది. దీని ధరను రూ.4,999గా నిర్ణయించింది. ఈ ఫోన్‌లో 3జీ, వై-ఫై, డ్యూయల్‌ సిమ్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌, ఒపెరా మిని, బ్లూంబర్గ్‌ యూటీవీ, న్యూస్‌హంట్‌, ఫేస్‌బుక్‌, నీంబూజ్‌ వంటి ప్రీలోడెడ్‌ అప్లికేషన్లు ఉంటాయి. 2జీ, 3జీ సిమ్‌లు రెండింటిని వాడవచ్చు. నోకియా, ఇతర సంస్థల పుష్‌- ఈ మెయిల్‌ సేవలను భద్రత కారణాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో మైక్రోమ్యాక్స్‌ కూడా పుష్‌-ఈమెయిల్‌ సేవలను ప్రారంభించడం విశేషం. తక్షణమే మెయిల్‌ పొందడానికి వినియోగదారులకు పుష్‌-ఈమెయిల్‌ దోహదం చేస్తుంది.

సాధారణంగా ఈ మైక్రోమ్యాక్స్ పుష్- ఈ మెయిల్ మొబైల్ విడుదల చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం బిజినెస్ పీపుల్‌ని దృష్టిలో ఉంచుకోని తయారుచేయడమైనది. బిజినెస్ పీపుల్ కొన్ని సందర్బాలలో కొన్ని మెయిల్స్‌ నోటిఫికేషన్స్‌కి అత్యవసరంగా కనెక్ట్ కావాల్సివస్తుంది. అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు వెల్లడించారు. మైక్రోమ్యాక్స్ దీని ధర కూడా ఇంత తక్కువ ఉంచి మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి కారణం బిజినెస్ పీపుల్‌ని టార్గెట్ చేయడం కోసమే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting