హ్యకర్ల చేతిలో యాహూ అకౌంట్లు?

Posted By: Prashanth

హ్యకర్ల చేతిలో యాహూ అకౌంట్లు?

 

నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌ల పై వీరంగం సృష్టించిన సైబర్ నేరగాళ్లు తాజగా యూహూ యూజర్ అకౌంట్ల పై కన్నేశారు. 'డీ33డీఎస్' పేరుతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ హ్యాకర్ల బృందం 4.5 లక్షల యాహూ యూజర్ అకౌంట్లతో పాటు పాస్‌వర్డ్‌లను దొంగిలించినట్లు ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్ ‘ద ఆర్స్ టెక్నికా’ వెల్లడించింది. ఈ గ్రూప్ యాహూ వెబ్‌సెట్‌కు చెందిన సబ్ డొమెయిన్‌ను హ్యాక్ చేసి ‘యాహూ వాయిస్’కు చెందిన అకౌంట్ల వివరాలను చోరి చేసింది. 'డీ33డీఎస్ డాట్ కో' వెబ్‌సైట్‌లో యాహూ యూజర్ల పాస్‌వర్డ్స్ వివరాలు తొలుత ప్రత్యక్షమయ్యాయి. అయితే, గురువారం తర్వాత ఆ సైట్ తెరుచుకోవట్లేదు. ఈ అంశం పై మాట్లాడేందుకు సింగపూర్ లోని యాహూ అధికార ప్రతినిధి నిరాకరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot