డిస్నీ + హాట్‌స్టార్ కొత్త ప్లాన్ లు లాంచ్!! నెట్‌ఫ్లిక్స్‌కు సమానమైన నాణ్యతతో

|

డిస్నీ + హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ దాని యొక్క ప్లాన్ లతో నెట్‌ఫ్లిక్స్‌ను వెనుకకు లాగుతోంది. ఇటీవల జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో 18 కొత్త హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ మల్టీప్లెక్స్ సినిమాలను ఆవిష్కరించినప్పుడు డిస్నీ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన టూ-టైర్ కంటెంట్-ఆధారిత వ్యూహాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. డిస్నీ + హాట్‌స్టార్‌లోని మొత్తం కంటెంట్, డిస్నీ + ఒరిజినల్స్ మరియు హాలీవుడ్ చలనచిత్రాలు మరియు డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్‌బిఓ, FX, షోటైం, 20వ శతాబ్దం మరియు సెర్చ్‌లైట్ పిక్చర్స్ నుండి టివి షోలు, గతంలో డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంకు ప్రత్యేకమైనవి ఇప్పుడు ఇవి అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే డిస్నీ + హాట్‌స్టార్ VIP ఇక లేదు.

 
డిస్నీ+హాట్‌స్టార్ కొత్త ప్లాన్లు లాంచ్!!నెట్‌ఫ్లిక్స్‌కు సమానమైన...

బదులుగా సెప్టెంబర్ 1 నుండి డిస్నీ + హాట్‌స్టార్ చందాదారుల కోసం మూడు కొత్త ప్లాన్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. వీటిలో "మొబైల్" ప్లాన్ సంవత్సరానికి రూ.499, "సూపర్" ప్లాన్ సంవత్సరానికి రూ.899 మరియు "ప్రీమియం" ప్లాన్ సంవత్సరానికి రూ.1,499 ధర వద్ద ఎంచుకోవచ్చు. అయితే ప్రారంభ VIP ప్లాన్ యొక్క ధర మాత్రం రూ.399 ప్రీమియం ధర మారదు. మీరు ఇప్పటికే డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంలో ఉంటే కనుక మీ కోసం పెద్దగా ఏమీ మారదు. మీరు ఇప్పుడు ఒకేసారి నాలుగు పరికరాల్లో స్ట్రీమింగ్ చేయగలరు. 4K ఇప్పటికీ ప్రీమియానికి ప్రత్యేకమైనది. డిస్నీ + హాట్‌స్టార్ సూపర్ హై-డెఫినిషన్ (హెచ్‌డి) వీడియో నాణ్యత ఒకేసారి రెండు పరికరాల్లో ప్రసారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

డిస్నీ+హాట్‌స్టార్ కొత్త ప్లాన్లు లాంచ్!!నెట్‌ఫ్లిక్స్‌కు సమానమైన...

ఇది డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్‌ను వదిలివేయనున్నది. ఇది నెట్‌ఫ్లిక్స్ యొక్క మొబైల్ ప్లాన్‌తో సమానంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒకే ఒక మొబైల్ పరికరానికి మాత్రమే పరిమితం చేస్తుంది. కానీ మీరు ఇప్పటికీ HD వీడియో నాణ్యతను పొందుతారు. వెబ్‌సైట్, మొబైల్ మరియు లివింగ్ రూమ్ డివైస్లు: డిస్నీ + హాట్‌స్టార్ సూపర్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియంలోని వారు అన్ని మద్దతు ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో సేవను యాక్సెస్ చేయవచ్చు. అంతర్జాతీయ కంటెంట్ అభిమానుల కోసం డిస్నీ + హాట్‌స్టార్ కొత్త ఎంట్రీ పాయింట్లను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Disney+ Hotstar Launches Three New Subscription Plans With HD Video Quality Streaming

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X