ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా.. వెంట‌నే డిలీట్ చేయండి!

|

భార‌త్‌లో ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. ఇందుకు త‌గ్గ‌ట్టు Google Play స్టోర్‌లో ర‌క‌ర‌కాల అప్లికేష‌న్లు డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే మ‌నం ఉప‌యోగించే అప్లికేష‌న్స్ అన్ని సుర‌క్షిత‌మైన‌వ‌ని అనుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్లే. వాటిల్లో కొన్ని మాల్‌వేర్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ మ‌న మొబైల్స్‌లోకి మాల్‌వేర్‌ల‌ను చొప్పించి హ్యాక‌ర్ల‌కు ఆయుధాలు ప‌నిచేస్తున్నాయి. త‌ద్వారా మ‌న డేటా, మ‌రియు అకౌంట్ల‌లో న‌గ‌దు త‌స్క‌ర‌ణ‌కు అవ‌కాశం ఏర్పడుతుంది. అలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన అప్లికేష‌న్ల గురించి మ‌నం తెలుసుకుందాం. అవి మ‌న మొబైల్స్‌లో లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌దాం.

 

కూల్ కాల‌ర్ స్క్రీన్ (Cool Caller Screen):

కూల్ కాల‌ర్ స్క్రీన్ (Cool Caller Screen):

మొబైల్స్‌లోకి మాల్‌వేర్‌ల‌ను చొప్పించే అప్లికేష‌న్ల జాబితాలో కూల్ కాల‌ర్ స్క్రీన్ యాప్ కూడా ఒక‌టి. ఇది Play స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది కాల‌ర్ స్క్రీన్ (Caller Screen) ను మ‌న ప్రిఫ‌రెన్స్ అనుగుణంగా ప్ర‌ద‌ర్శించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ అప్లికేష‌న్ ప్ర‌మాద‌క‌ర‌మైన మాల్‌వేర్‌ల‌ను క‌లిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ యాప్‌తో జాగ్ర‌త్త గా ఉండాలి.

డాక్యూమెంట్ మేనేజ‌ర్ (Document Manager):

డాక్యూమెంట్ మేనేజ‌ర్ (Document Manager):

ఈ యాప్ మీ మొబైల్‌లోని డాక్యూమెంట్స్, ఫైల్స్ ను మేనేజ్ చేయ‌డానికి వినియోగించ‌బ‌డుతుంది. అంతేకాకుండా ఇది పీడీఎఫ్‌, వ‌ర్డ్‌, ఎక్సెల్ ఇత‌ర‌త్రా డాక్యూమెంట్స్ సులువుగా ఓపెన్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతున్నట్లు క‌నిపిస్తుంది. కానీ, ఈ అప్లికేష‌న్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన మాల్‌వేర్‌ల‌ను క‌లిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ యాప్‌తో జాగ్ర‌త్త గా ఉండాలి.

ఆర్‌జీబీ ఎమోజీ కీబోర్డ్ (RGB Emoji Keyboard)
 

ఆర్‌జీబీ ఎమోజీ కీబోర్డ్ (RGB Emoji Keyboard)

ఆర్‌జీబీ ఎమోజీ కీబోర్డ్ అప్లికేష‌న్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్. ఇది మీ మొబైల్‌లోని డేటా మ‌రియు న‌గ‌దుద‌ను త‌స్క‌రించే ప్ర‌మాదం ఉంటుంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొల‌గించారు. కానీ, ఇదేవిధంగా ఇంకా కొన్ని యాప్‌లు ప్లేస్టోర్‌లో ఉన్నాయి. వాటితో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

కెమెరా ట్రాన్స్‌లేట‌ర్ ప్రో (Camera Translator Pro)

కెమెరా ట్రాన్స్‌లేట‌ర్ ప్రో (Camera Translator Pro)

ఇత‌ర విదేశీ భాష‌ల్లో ఉన్న టెక్స్ట్ ను మీరు చ‌ద‌వ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అయిన‌ప్ప‌టికీ, ఈ యాప్ ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్‌ను క‌లిగి ఉంది. ఈ యాప్ యూజ‌ర్ల డేటా, వ్య‌క్తిగ‌త స‌మాచారంపై యాక్సెస్‌ను ద‌క్కించుకుంటుంది. కాబ‌ట్టి ఈ యాప్‌తో కూడా జాగ్ర‌త్తగా ఉండాలి.

క‌ల‌ర్‌ఫుల్ మెసెంజ‌ర్ (Colorful Messenger)

క‌ల‌ర్‌ఫుల్ మెసెంజ‌ర్ (Colorful Messenger)

గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న అత్యంత ప్ర‌మాద‌క‌ర యాప్‌ల‌లో ఈ క‌ల‌ర్‌ఫుల్ మెసెంజ‌ర్ యాప్ కూడా ఒక‌టి. ఈ యాప్‌ను మీ మొబైల్ ఫోన్ల‌లో క‌లిగి ఉన్న‌ట్ల‌యితే ఉన్న ఫ‌ళంగా దీన్ని డిలీట్ చేయ‌డం ఉత్త‌మం అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఫాస్ట్ పీడీఎఫ్ స్కాన‌ర్ (Fast PDF Scanner)

ఫాస్ట్ పీడీఎఫ్ స్కాన‌ర్ (Fast PDF Scanner)

ఈ యాప్ పేరు ప్ర‌కారం పీడీఎఫ్ స్కాన‌ర్‌గా మ‌న‌కు తెలుస్తోంది. ఇది ఇత‌ర డాక్యూమెంట్స్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి క‌న్వ‌ర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది గా తెలుస్తోంది. దీన్ని కూడా డిలీట్ చేయ‌డం ఉత్త‌మం అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

తగ్ ఫొటో ఎడిట‌ర్ (Thug Photo Editor)

తగ్ ఫొటో ఎడిట‌ర్ (Thug Photo Editor)

ఈ తగ్ ఫొటో ఎడిట‌ర్ యాప్‌ను ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించారు. గూగుల్ ప్లే డేంజ‌ర‌స్ యాప్స్ జాబితాలో ఇది ఉంది. పేరు ప్ర‌కారం ఇది యూజ‌ర్ల‌ను ఫొటో ఎడిటింగ్‌కు అనుమ‌తి ఇస్తుంది. కానీ , అదేవిధంగా ఇది యూజ‌ర్ల డేటా, న‌గ‌దును త‌స్క‌రిస్తుంది.

స్మార్ట్ కీ బోర్డ్ (Smart Keyboard)
గూగుల్ ప్లే స్టోర్‌లో చాలా వ‌ర‌కు కీ బోర్డ్‌ల‌కు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. కానీ అందులో చాలా యాప్స్ సుర‌క్షిత‌మైన‌వి కాదు. ఈ స్మార్ట్ కీ బోర్డ్ యాప్ చూడ‌టానికి మీకు ఈజీ టైపింగ్ యాప్ మాదిరి క‌నిపిస్తుంది. కానీ, ఇది మీ డేటా, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని త‌స్క‌రిస్తుంది.

Best Mobiles in India

English summary
8 most dangerous app on google play store.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X