IRCTC Rail Connectతో టికెట్ బుకింగ్ మరింత సులభం

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌ ద్వారా ఒక్క టికెట్ బుకింగ్ మాత్రమే కాదు క్విక్ రీఫండ్ ఆప్షన్ ద్వారా వాటిని క్యాన్సిల్ కూడా చేసేయవచ్చు.

|

ఇంటర్నెట్ మనందరి జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఉదయం నిద్ర‌లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఇంటర్నెట్‌తో అనేక అవసరాలు ముడిపడి ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్ ద్వారానే ప్రజలకు చేరువకావాలని చూస్తున్నాయి. తాజాగా, ఇండియన్ రైల్వేస్ IRCTC Rail Connect యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ మరింత సులభతరంగా మారిపోయింది.

Android, iOS అలానే Windows  వర్షన్స్..

Android, iOS అలానే Windows వర్షన్స్..

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌ను Android, iOS అలానే Windows స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇండియన్ రైల్వేస్ అందుబాటులో ఉంచింది. ఆయా యాప్ స్టోర్‌లలోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

అనేక సదుపాయాలు..

అనేక సదుపాయాలు..

న్యూ అకౌంట్ రిజిస్ట్రేషన్, అడ్వాన్సుడ్ సెక్యూరిటీ, లేడీస్ బుకింగ్, తత్కాల్ బుకింగ్, ప్రీమియమ్-తత్కాల్ కోటా బుకింగ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐఆర్‌సీటీసీ ఇ-వాలెట్, సింకింగ్ ఆఫ్ ఐఆర్‌సీటీ ఎన్‌జీఈటి వెబ్‌సైట్, ఎన్‌జీఈటి మొబైల్ యాప్ టికెట్స్, ఇ-టికెట్స్ స్టేటస్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ యాప్‌లో ఉన్నాయి.

క్లీన్‌ యూజర్ ఇంటర్‌ఫేస్..

క్లీన్‌ యూజర్ ఇంటర్‌ఫేస్..

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌కు సంబంధించిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత క్లీన్‌గా డీసెంట్ లుక్‌ను కలిగి ఉంటుంది. అంతరాయంలేని పనితీరును ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఆఫర్ చేస్తుంది. టికెట్లను సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీరు చెల్లించే ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా మరింత సెక్యూర్‌గా ఉంటాయి.

క్విక్ రీఫండ్ ఆప్షన్ ద్వారా క్యాన్సిలేషన్ కూడా..

క్విక్ రీఫండ్ ఆప్షన్ ద్వారా క్యాన్సిలేషన్ కూడా..

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్‌ ద్వారా ఒక్క టికెట్ బుకింగ్ మాత్రమే కాదు క్విక్ రీఫండ్ ఆప్షన్ ద్వారా వాటిని క్యాన్సిల్ కూడా చేసేయవచ్చు. గతంలో బుక్ చేసిన టికెట్లకు సంబంధించిన హిస్టరీని కూడా తెలుసుకునే వీలుంటుంది.

మరిన్ని సదుపాయాలు...

మరిన్ని సదుపాయాలు...

ప్రయాణ సమయంలో మీల్స్ బుకింగ్, సెక్యూర్ పేమెంట్స్, టీడీఆర్ ఫైలింగ్ వంటి ప్రత్యేకమైన ఆప్షన్స్ కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. విమాన టికెట్లను కూడా ఈ యాప్ సహాయంతో బుక్ చేసుకోవచ్చు.

టికెట్‌ను సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు..

టికెట్‌ను సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు..

పేమెంట్ పూర్తి అయిన తరువాత టికెట్‌ను మీ మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు. టికెట్‌ను సేవ్ చేసుకుని తరువాత ప్రింట్ తీసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తోంది. యాప్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటే అవసరం‌లేని బుకింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
IRCTC Rail Connect – Book train ticket on the go. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X