వర్జిన్ మొబైల్ వస్తుందోచ్..!!!

Posted By: Staff

వర్జిన్ మొబైల్ వస్తుందోచ్..!!!

3జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంఛ్ చేసేందుకు  వర్జిన్ మొబైల్స్ తయారీ యూనిట్  సన్నాహాలు చేసింది. ‘ఆల్కాటెల్ వెంచర్’(Alcatel Venture) పేరుతో లభ్యం కానున్న ఈ ఫోన్ ఫీచర్లను ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఆల్కాటెల్ వెంచర్  ప్రధాన ఫీచర్లు:

- ఫోన్ స్ర్కీన్ 2.8 అంగుళాల పరిమాణాన్ని కలిగి మల్టీ  వ్యవస్థతో పని చేస్తుంది.

- ఏర్పాటు చేసిన క్వర్టీ కీప్యాడ్ సౌకర్యవంతమైన

టైపింగ్‌కు తోడ్పడుతుంది. (ఛాటింగ్ నిర్వహించుకునే వారికి ఉత్తమ ఎంపిక),

- నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్    ఆపరేటింగ్ సిస్టం పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ    స్వభావాన్ని కలిగి సులువైన ఆపరేటింగ్‌కు    సహకరిస్తుంది.

-  పొందుపరిచిన క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7627,600  మెగాహెడ్జ్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

-  ఫోన్ వెనుక భాగంలో అమర్చిన కెమెరా 1.9 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ (1600 x1200 పిక్సల్స్),

-   ర్యామ్ సామర్ధ్యం 512ఎంబీ,

-   రోమ్ స్వభావం (Flash EEPROM),

-   కనెక్టువిటీ అంశాలు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్, ఆండ్రాయిడ్ బ్రౌజర్,

-   నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ, 3జీ,

-   స్టీరియో సౌండ్‌ను సపోర్ట్ చేసే ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోఫోన్      ఆడియో జాక్,

-   బ్యాటరీ స్టాండ్‌బై 12 రోజులు, టాక్‌టైమ్ 4 గంటలు,

-   ధర అంచనా రూ.5,000.

-   విడుదల 2012 ద్వితియ త్రైమాసికం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot