మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ధ‌ర‌లు, ఫీచ‌ర్లు చూడండి!

|

ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5G మొబైల్స్ హ‌వా కొన‌సాగుతోంది. దేశంలో ఇప్పటికే 5G టెస్టింగ్ ప్రారంభించినందున, ఈ డివైజ్‌ల‌కు డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. 5G మొబైల్స్ కేవ‌లం ఫ్లాగ్‌షిప్ కేట‌గిరీలో మాత్ర‌మే కాదు.. ర‌క‌ర‌కాల ధ‌ర‌ల్లో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. భారతీయ మార్కెట్‌లో ఇటీవల ర‌క‌ర‌కాల కంపెనీల నుంచి వివిధ ధ‌ర‌ల్లో ప‌లు 5G మొబైల్స్ విడుద‌ల‌య్యాయి.

best 5g mobiles

మీరు క‌నుక ఇప్పుడు 5G కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న‌ట్ల‌యితే.. మీ కోసం మేం ఇటీవ‌ల విడుదల చేసిన ఉత్తమ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌లను జాబితా ను అందిస్తున్నాం. దీనిపై ఓ లుక్కేయండి. మీరు సరైన మొబైల్ కొనుగోలు చేసే విధంగా మీకు సహాయపడేలా వివరణాత్మక స్పెసిఫికేషన్‌లను కూడా మేము ఇక్క‌డ అందిస్తున్నాం. ఈ జాబితాలో Nothing Phone(1), iQOO 9T, OnePlus 10R, Google Pixel 6A, Oppo Reno8 Pro 5G మరియు మరెన్నో ఉన్నాయి.

iQoo 9T స్పెసిఫికేష‌న్లు:

iQoo 9T స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.49,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

ఈ మొబైల్ కు 6.78 అంగుళాల ఫుల్‌ HD+AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Snapdragon 8+ Gen1 chipset ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 50MP + 13MP +12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Nothing Phone (1) స్పెసిఫికేష‌న్లు:

Nothing Phone (1) స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.35,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

నథింగ్ ఫోన్ 1 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.55-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 RAMతో జత చేయబడి వస్తుంది. దీనికి 50 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 4,500 mAh బ్యాట‌రీ ఇస్తున్నారు.

OnePlus 10R స్పెసిఫికేష‌న్లు:

OnePlus 10R స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.39,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

OnePlus Ace 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 720Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2,412×1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్ మరియు 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం మాలి G610 GPUతో ఆధారితమైనది. ఫోన్ 8GB/12GB LPDDR5 ర్యామ్ మరియు 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ తో వ‌స్తోంది.

OnePlus 10 Pro స్పెసిఫికేష‌న్లు:

OnePlus 10 Pro స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.66,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్‌ HD+ క‌ర్వ్‌డ్‌ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Qualcomm Snapdragon 8 Gen1 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 48MP + 50MP +8MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Vivo X80 5G స్పెసిఫికేష‌న్లు:

Vivo X80 5G స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.54,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

ఈ మొబైల్ కు 6.78 అంగుళాల ఫుల్‌ HD+ E5 AMOLED HDR10+ పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 108MP + 12MP + 12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Vivo X80 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

Vivo X80 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.82,990 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

ఈ మొబైల్ కు 6.78 అంగుళాల క్వాడ్‌ HD+ E5 AMOLED LTPO పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Dimensity 9000 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్, 256జీబీ|512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 50MP + 48MP + 12MP + 8MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. ఈ డివైజ్ (IP68) వాట‌ర్ రెసిస్టెంట్ టెక్నాల‌జీని క‌లిగి ఉంది.

Google Pixel 6A స్పెసిఫికేష‌న్లు:

Google Pixel 6A స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.43,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 6.1-అంగుళాల ఫుల్-HD+(1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB LPDDR5 RAMతో జత చేయబడి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే కెమెరా యూనిట్‌లో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఈ మొబైల్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

OPPO Reno8 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

OPPO Reno8 Pro 5G స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.45,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

Oppo Reno 8 Pro మొబైల్‌ MediaTek Dimensity 8100 (or 8100 Max) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ Mediatek's Dimensity 8100 మోడ‌ల్ చిప్ సెట్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ర్యామ్ సామ‌ర్థ్యం ఆధారంగా రెండు వేరియంట్ల‌లో రానుంది. వాటిలో 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఒక వేరియంట్ వ‌స్తుండ‌గా, 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మ‌రో వేరియంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌ని చేస్తుంది.

Realme GT Neo 3 5G స్పెసిఫికేష‌న్లు:

Realme GT Neo 3 5G స్పెసిఫికేష‌న్లు:

భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ మొబైల్ రూ.42,999 అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్ల‌పై ఓ లుక్కేద్దాం.

రియల్‌మి GT నియో 3 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 లో రియల్‌మి యుఐ 3.0 తో రన్ అవుతుంది. అలాగే 120HZ రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,412) డిస్ప్లేను HDR10+ మద్దతుతో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ మెరిటెక్ 8100 5G SOC తో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 RAM తో జత చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వేడిని వెదజల్లడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ శీతలీకరణ టెక్నాలజీని కలిగి ఉంది. బ్యాక్‌సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Best Premium 5G Smartphones Launched Recently To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X