సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 vs నోకియా లూమియా 920

By Prashanth
|
Samsung Galaxy Note 2 vs Nokia Lumia 920


సామ్‌సంగ్, నోకియాల మధ్య మరో రసవత్తరమైన పోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన సామ్‌గెలాక్సీ నోట్ 2, త్వరలో విడుదల కాబోతున్న లూమియా 920ల పై మార్కెట్ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. ఆండ్రాయిడ్, విండోస్‌ల మధ్య నెలకున్న పోటీగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ......

చుట్టుకొలత ఇంకా బరువు:

గెలాక్సీ నోట్ 2: చుట్టుకొలత 151.1 x 80.5 x 9.4మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు,

లూమియా 920: బరువు 185 గ్రాములు, చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్టీ మీటర్లు,

డిస్‌ప్లే:

గెలాక్సీ నోట్ 2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఎస్-పెన్ స్టైలస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్,

ప్రాసెసర్:

గెలాక్సీ నోట్2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్, మాలీ-400మెగాపిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ నోట్2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

లూమియా 920: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్),

లూమియా 920: 8.7 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్, జియో-టాగింగ్, ప్యూర్‌వ్యూ కెమెరా టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్:

గెలాక్సీ నోట్ 2: మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్,

కనెక్టువిటీ:

గెలాక్సీ నోట్ 2: హెచ్‌ఎస్‌డిపిఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, ఎల్‌టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, 4జీ ఎల్‌టీఈ, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ అండ్ ఈడీఆర్, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0,

లూమియా 920: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, క్యూ ఐ వైర్ లెస్ చార్జింగ్, 4జీ ఎల్‌టీఈ,

బ్యాటరీ:

గెలాక్సీ నోట్2: 3100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

లూమియా 920: 2,000ఎమ్ఏహెచ్ Li-ion బ్యాటరీ (టాక్ టైమ్ 10 గంటలు, స్టాండ్ బై 400 గంటలు),

తీర్పు:

స్పెసిఫికేషన్‌ల విషయంలో ఈ రెండు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు హోరాహోరిగా తలపడుతున్నాయి. వేరు వేరు ఆపరేటింగ్ సిస్టంలను కలిగి ఉన్న ఈ డివైజ్‌లు అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. గెలాక్సీ నోట్2లో నిక్షిప్తం చేసిన ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, ఎస్ బీమ్, పాప్- అప్ ప్లే వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఇదే సమయంలో లూమియా 920లో నిక్షిప్తం చేసిన వైర్‌లెస్ చార్జింగ్, గ్లవ్ - ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి. మెరుగైన బ్యాటరీ, హై క్వాలిటీ కెమెరా ఇంకా భిన్నమైన కలర్ వేరింయట్‌లను కోరుకునే వారికి లూమియా 920 ఉత్తమ ఎంపిక. అదే సమయంలో పెద్దదైన డిస్‌ప్లే, మెరుగైన మెమరీ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా స్టైలస్ పెన్ సపోర్ట్‌ను కోరుకునే వారికి గెలాక్సీ నోట్2 బెస్ట్ చాయిస్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X