పగలని ఫోన్ డిస్‌ప్లే కోసం చూస్తున్నారా..?

Written By:

మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్ ఎప్పుడైనా యాక్సిడెంటల్‌గా జారిపడిందా..? ఈ ప్రశ్నకు సమధానంగా చాలామంది అవుననే చెబుతారు. ఎందుకంటే..? స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న ప్రతిఒక్కరూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ను ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసి ఉండవచ్చు. చేతిలోని ఫోన్ జారిపడటమనేది నిర్లక్ష్యం కారణంగా జరగొచ్చు లేదా యాదృఛ్ఛికంగా సంభవించవచ్చు.

పగలని ఫోన్ డిస్‌ప్లే కోసం చూస్తున్నారా..?

ఫోన్ క్రింద పడటానాకి కారణం ఏదైనా అయినప్పటికి, డిస్‌ప్లే మాత్రం దాదాపుగా ధ్వంసమవటం ఖాయం. ఫోన్‌లు క్రిందపడి పగిలిపోయిన చాలా వరకు సంఘటనల్లో డిస్‌ప్లేను తొలగించటం లేదా డ్యామేజీ ఖర్చులను ఎక్కువగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం కొత్త ఫీచర్ల కోసం కోట్లాది రూపాయిలను వెచ్చిస్తోన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఫోన్ డిస్‌ప్లే మన్నిక పై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోతున్నాయి.

మీ గాడ్జెట్‌లను, మీరే నాశనం చేసుకుంటున్నారు!!

క్రిందపడినా ధ్వంసం కాని shatterproof డిస్‌ప్లే మోటరోలా అభివృద్థి చేసిన 'మోటో ఎక్స్ ఫోర్స్' మార్కెట్లో సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

కింద పడినా పగలని సామర్థ్యాలతో మోటరోలా అభివృద్థి చేసిన శక్తివంతమైన ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'(Moto X Force) ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

క్రిందపడినా ధ్వంసం కాని shatterproof డిస్‌ప్లే, వాటర్-రిపెల్లెంట్ నానో - కోటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ దృఢమైన ఫోన్‌లో మోటరోలా పొందుపరిచింది.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

shatterproof డిస్‌ప్లేతో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా మోటో ఎక్స్ ఫోర్స్ హిస్టరి క్రియేట్ చేసింది.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

ఈ ఫోన్‌‍లో పొందుపరిరచిన మోటో షాటర్‌షీల్డ్ ఫీచర్ ఫోన్ డిస్‌ప్లే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

షాక్ ప్రభావాన్ని తట్టుకోగలిగే ఫైవ్ లేయర్ ఇంటిగ్రేటెడ్ సిస్టంతో మోటో ఎక్స్ ఫోర్స్ డిస్‌ప్లేను అభివృద్థి చేసారు.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్810 సాక్‌ను ఏర్పాటు చేసారు. 600 మెగాహెర్ట్జ్ సామర్థ్యంతో వచ్చిన 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ హై క్వాలిటీ గేమింగ్‌ను అందిస్తుంది.

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌తో)

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్’

ఈ ఫోన్ రెండు ఇంటర్నల మెమరీ వేరియంట్స్ లో దొరుకుతోంది. ఒకటి 32జీబి మరొకటి  64జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1440×2560పిక్సల్స్) విత్ మోటో షాటర్‌షీల్డ్ టెక్నాలజీ,

 

 

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్

 ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0),3జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,

 

 

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్

టర్బో చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఆప్షన్స్
(4జీ ఎల్టీఈ, 3జీ, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీ), .

మోటరోలా నుంచి ‘కింద పడినా పగలని ఫోన్

ధర విషయానికొస్తే.. 32జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్ ధర రూ.49,999. 64జీబి వర్షన్ మోటో ఎక్స్ ఫోర్స్ ఫోన్ ధర రూ.53,999.ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ (Amazon, Flipkart), ఆఫ్‌లైన్ (Chroma, Spice Hotspot) మార్కెట్లలో ఫోన్ లభ్యంకానుంది.

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
With screen that really won't break? Answer these questions. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot