ఇంటర్నెట్ మ్యూజిక్ ప్లేయర్!!

Posted By: Staff

ఇంటర్నెట్ మ్యూజిక్ ప్లేయర్!!

 

ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకుని నిరంతరం సంగీతాన్ని వీడియ అదేవిధంగా ఆడియో రూపంలో ఆస్వాదించే సామాజిక మ్యూజిక్ పరికరాన్ని మిసీలు నియరో (Miselu Neiro)సంస్థ డిజైన్ చేసింది. తాజాగా నిర్వహించిన SXSW వేడుకలో ఈ వినూత్న మ్యూజిక్ పరికరాన్ని ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఆధిరాతంగా పనిచేసే ఈ ప్లేయర్‌లో అల్ట్రా మోడ్రన్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేశారు.

ప్లేయర్ ముఖ్య పీచర్లు:

* శక్తివంతమైన మల్టీ టచ్ వైడ్-స్ర్కీన్,

* ప్రెజర్ సెన్సిటివ్ కీబోర్డ్,

* హైస్పీడ్ వై-ఫై టెక్నాలజీ,

* ఇంటర్నెట్ కనెక్షన్,

* బ్లూటూత్ కనెక్టువిటీ,

* ఫ్లెక్సిబుల్ డేటా ట్రాన్సఫర్,

* హై క్వాలిటీ వెబ్‌క్యామ్,

* హై క్వాలిటీ ఆడియో,

* హై క్వాలిటీ ప్రొడక్షన్ మరియు ఎఫెక్ట్స్ ను విడుదల చేసే NSX-1 DSP చిప్ వ్యవస్థ,

* సెక్యూరిటీ డిజిటల్ (ఎస్డీ) కార్డ్ స్లాట్,

* యూఎస్బీ కనెక్టువిటీ, హెడిఎమ్‌ఐ కనెక్టువిటీ,

* బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు,

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లేయర్ లో దోహదం చేశారు. ప్రధానంగా యువతను ఈ ప్లేయర్ ఆకర్షిస్తుంది. ఈ అల్ట్రామోడ్రన్ మ్యూజిక్ ప్లేయర్ ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot