లగ్జరీ వినోదం!!

Posted By: Prashanth

లగ్జరీ వినోదం!!

 

తక్కువ వాల్యూమ్‌తో వీడియోగేమ్ ఆడటం గేమింగ్‌లవర్స్‌కు అంతగా సంత్ళప్తి కలిగించదు.. అలా అని ఎక్కువ వాల్యూమ్‌తో ట్రై చేస్తే పక్కవారు ఆసౌకర్యానికి లోనవుతుంటారు. ఈ సమస్యను నివారిస్తూ మార్కెట్లోకి డాల్బీ డిజిటల్ హెడ్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి క్వాలిటీ విషయంలో చతికిల బడ్డాయి. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం ఆస్ట్ర్రో గేమింగ్ A40sఆడియో సిస్టం అందుబాటులోకి వచ్చింది. ఉత్తమ క్వాలిటీ సౌండ్ టెక్నాలజీతో ఈ హెడ్‌సెట్‌ను డిజైన్ చేశారు.

వివరణాత్మకమైన ఆడియో అనుభవాన్ని ఈ డివైజ్ పంచుతుంది. పొందుపరిచిన నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ గేమింగ్ సమయంలో అనవసర శబ్ధాలను వేరుచూస్తూ స్వచ్ఛమైన ఆడియో అనుభూతిని చేరువచేస్తుంది. వాల్యూమ్ కంట్రోల్ మరియు వాయిస్‌ను సమతుల్యపరించేందుకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్ధను ఆడియో సిస్టం ద్వారా పొందవచ్చు. సౌకర్యవంతమైన ఇయర్ ప్యాడ్స్ ఉన్నత స్ధాయి సౌకర్యాన్ని కలిగిస్తాయి. ఏర్పాటు చేసిన క్విక్ కనెక్ట్ కేబుల్ సిస్టం ద్వారా హెడ్‌ఫోన్‌ను పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్ తదితర డివైజ్‌కు ఈ హెడ్ ఫోన్ సిస్టంను జత చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో A40s ఆడియో సిస్టం అంచనా వ్యయం రూ.15,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting