ఐపోడ్ కోసం హెడ్‌ఫోన్ యాంప్లిఫైయిర్!!

Posted By: Prashanth

ఐపోడ్ కోసం హెడ్‌ఫోన్ యాంప్లిఫైయిర్!!

 

ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు న్యూ ఫోర్స్ (Nuforce) ఆపిల్ గ్యాడ్జెట్ల ద్వారా విడుదలయ్యే ఆడియోను మరింత నాణ్యతతో వినేందుకు గాను కాంపాక్ట్ హెడ్‌ఫోన్ యాంప్లీఫయర్‌ను విడుదల చేసింది. ఆపిల్ గ్యాడ్జెట్లు ఐపోడ్, ఐప్యాడ్, ఐఫోన్ డివైజులకు ఈ Nuforce iDo యాంప్లీఫయర్‌ను జత చేసుకోవచ్చు.

విధానం:

ప్రత్యేకించి ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం డిజైన్ చేసిన ఈ యాంప్లిఫయర్‌ను ఐపోడ్, ఐప్యాడ్ లేదా ఐఫోన్‌కు జతచేసుకోవచ్చు. యాంప్లిఫయర్ ముందు వెనుక భాగాల్లో హెడ్‌ఫోన్ అదేవిధంగా మ్యూజిక్ డివైజును జత చేసుకునే విధంగా పోర్టులను ఏర్పాటు చేశారు. డివైజు ద్వారా విడుదలైన ఆడియో కంటెంట్‌ను యాంప్లిఫయర్ ఫిల్టర్ చేసి నాణ్యమైన పిచ్‌లో హెడ్ ఫోన్ల ద్వారా శ్రోతకు పంపిస్తుంది.

క్లుప్తంగా యాంప్లిఫైయిర్ ఫీచర్లు:

- చుట్టు కొలతులు 6 inch x 4.5 inch x 1 inch,

- ఆడియో సర్దుబాటు కోసం ప్రత్యేక వ్యవస్థ,

- 3.5 mm జాక్,

- కనెక్టువిటీ సౌలభ్యత,

- ఫ్రీక్వెన్సీ సౌమర్ధ్యం 10Hz నుంచి 20KHz వరకు,

- ఎస్ఎన్ఆర్ 95Db,

- ధర రూ.12,000

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot