ప్రపంచం నాశనమైపోయినా.. ఈ మెమరీ చిప్ సేఫ్!

Posted By: Prashanth

ప్రపంచం నాశనమైపోయినా.. ఈ మెమరీ చిప్ సేఫ్!

 

లండన్: ఓ భయానక ప్రళయం సంభవించి ప్రపంచమంతా నాశనమైపోయినా, ఈ మెమరీ చిప్‌లో స్టోర్ చేసిన డేటా మాత్రం భద్రంగా ఉంటుంది. 1000డిగ్రీల వేడి సైతం ఈ మెమరీ చిప్ ముందు బలాదూర్.. నీటిలో పడినా ఇట్టే తేలిపోద్ది... రేడియేషన్, ఇతర హానికర రసాయనాలు ఈ డేటా సేవర్ ను ఏమాత్రం మట్టికురిపంచలేవు. ఈ డేటాకార్డ్‌లో స్టోర్ చేసే సమాచారం 10కోట్ల సంవత్సరాల దాకా నిక్షిప్తంగా ఉంటుంది. ఇంతకీ ఏంటీ చిప్‌లోని విశేషం..?, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్లాస్‌తో డిజైన్ కాబడిన ఈ డేటా కార్డును జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ రూపొందించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. ఈ డేటాకార్డులోని సమాచారం ఎప్పటీకీ భద్రంగా ఉంటుందని సంస్థ పరిశోధకుడు కుజుయోషి టోరి తెలిపారు. నాలుగు పొరలున్న ఈ కార్డులో ఒక చదరపు అంగుళానికి సుమారు 40 మెగాబైట్ల సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తంచేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot