ఐడియా కొత్త ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.255కే

ఇండియన్ టెలికం సెక్టార్‌లో 4జీ డేటా వార్‌కు తెరలేపిని జియోకు ప్రత్యర్థుల నుంచి అడుగడుగునా పోటీ ఎదురవుతోంది. తాజా ఐడియా సెల్యులార్, జియో 4జీని టార్గెట్ చేస్తూ సరికొత్త 4జీ ప్లాన్‌ను రంగంలోకి దింపింది.

ఐడియా కొత్త ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.255కే

హ్యాండ్‌సెట్ అప్‌గ్రేడ్ పేరుతో వస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా రూ.255 చెల్లిస్తే చాలు 10జీబి 4జీ డేటా లభిస్తుంది. ఈ ప్రమోషనల్ డేటా ఆఫర్ డిసెంబర్ 31, 2016 వరకు అందుబాటులో ఉంటుంది.

Read More : బ్రాండెడ్ హోమ్‌ థియేటర్‌‌లు, రూ.2,959కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త 4జీ స్మార్‌ఫోన్‌ యూజర్లకు మాత్రమే!

కొత్త 4జీ స్మార్‌ఫోన్‌లను కొనుగోలు చేసే ఐడియా యూజర్లకు ఈ ఆఫర్ మూడు నెలల పాటు వర్తిస్తుంది.

ప్రతినెలా రూ.255 చెల్లిస్తే చాలు..

ప్రతినెలా 1జీబి ఇంటర్నెట్‌కు రూ.255 వెచ్చిస్తే చాలు, మీగితా 9జీబి ఉచితంగా లభిస్తుంది. ఈ 10జీబి 4జీ డేటాను మీరు 28 రోజుల వ్యాలిడిటీతో వాడుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

ఒక వేళ మీరు 3జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే...

ఒక వేళ మీరు 3జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే ఉచితంగా క్రెడిట్ అయ్యే 9 GB ఉచిత ఇంటర్నెట్‌ను రాత్రి వేళ మాత్రమే ఉపయోగించుకోవల్సి ఉంటుంది. నైట్ డేటా టైమింగ్స్ వచ్చే సరికి రాత్రి 12 గంటల దగ్గర నుంచి ఉదయం 6 గంటల వరకు.

మీరు 4జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే...

మీరు 4జీ సర్కిల్‌లో ఉన్నట్లయితే ఉచితంగా క్రెడిట్ అయ్యే 9 GB ఉచిత ఇంటర్నెట్‌ను 4జీలోనే ఉపయోగించుకోవల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ డేటాను 3జీ లేదా 2జీ నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకున్నట్లయితే ఇంటర్నెట్ బ్యాలన్స్ త్వరత్వరగా డిడక్ట్ కాబడుతుంది.

సర్వీస్ ప్రొవైడర్ మీ నెంబర్‌ను‌ వెరిఫై చేయటం ద్వారా..

ఐడియా సర్వీస్ ప్రొవైడర్ మీ మొబైల్ నెంబర్‌ను‌ వెరిఫై చేసి, ఓ OTP కోడ్‌ను మీకు పంపటం ద్వారా ఆఫర్ మీకు వర్తిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A Threat to Reliance Jio: Enjoy 10 GB 4G Data at Just Rs.255. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot