20 శాతం వాటాను విక్రయిస్తున్న టాటా గ్లోబల్‌ బెవరేజస్‌

Posted By: Staff

20 శాతం వాటాను విక్రయిస్తున్న టాటా గ్లోబల్‌ బెవరేజస్‌

లండన్‌: టాటా గ్లోబల్‌ బెవరేజస్‌ అంతర్జాతీయ మార్కెట్లో టీ బ్రాండ్‌లయిన టాటా టీ, టెట్లీ బ్రాండ్‌ లను విక్రయిస్తోంది. వచ్చే కొన్ని నెలల్లో కంపెనీ నుంచి 20 శాతం వాటాలను విక్రయించాల నుకుంటోంది. కంపెనీకి పెప్సీకో, స్టార్‌బక్స్‌తో కూడా భాగస్వామ్యం ఉంది. కంపెనీ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ... తమతో భాగస్వామ్యం చేపట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని...పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నమని ..కంపెనీకి ఎది అనుకూలమో ఆలోచించి తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. టాటా గ్లోబల్‌ బేవరేజస్‌ 2007లో గ్లాసియో (విటమిన్‌ వాటర్‌) ఉత్పత్తి చేసే కంపెనీలో 30 శాతం వాటాను కోకాకోలాకు విక్రయించి బిలియన్‌ డాలర్లు రూ.4,500 కోట్లు సేకరించింది. ఈ డబ్బుతో పలు కంపెనీలను టెకోవర్‌ చేసేందుకు వినియోగించుకుంటామని కుమార్‌ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot