కొత్తదనంతో వస్తున్నాం.. టార్గెట్ 500 కోట్లు!

Posted By: Super

 కొత్తదనంతో వస్తున్నాం.. టార్గెట్ 500 కోట్లు!

న్యూఢిల్లీ: ఫీచర్ మొబైల్ ఫోన్‌లను రూపొందించే దేశీయ సంస్థ జెన్ మరో అడుగు ముందుకేస్తూ టాబ్లెట్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణ విభాగాల్లోకి ప్రవేశించనుంది. ఈ వివరాలను జెన్ మొబైల్స్ ఎండీ దినేష్ గుప్తా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు టాబ్లెట్ పీసీలతో పాటు ఆరు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.325 కోట్ల టర్నోవర్ సాధించామని, ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.500 టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా స్పష్టం చేశారు. మార్కెట్లో స్మార్ట్ డివైజ్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అల్ట్రా ట్యాబ్ ఏ100 పేరుతో జూలై 14న ఓ టాబ్లెట్ పీసీని ఆవిష్కరించనున్నట్లు వివరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot