గూగుల్ నుంచి ఛాటింగ్ యాప్,వాట్సప్, టెలిగ్రాంలకు షాక్ తప్పదా ?

|

2016 సెప్టెంబర్ లో అనేక అంచనాల మద్య విడుదలైన గూగుల్ అల్లో, ఆండ్రాయిడ్ ఫోన్లకు imessage వలె ఉపయోగపడుతుంది అని అందరూ భావించారు. మరియు ఆ ఆలోచనలకు తగ్గట్లే గూగుల్ కూడా స్టిక్కర్స్, GIFs, మరియు వెబ్ - క్లైంట్ ఫీచర్లను కూడా "అల్లో" లో ప్రవేశ పెడుతున్నట్లుగా , తద్వారా ఒక పరిపూర్ణమైన మెసేజింగ్ అప్లికేషన్ ను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపింది. క్రమంగా అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. కానీ కొన్ని ఇంటర్నెట్ నివేదికల ఆధారంగా, గూగుల్ తన "అల్లో" అప్లికేషన్ ను కొంతకాలం పక్కన పెట్టి, ఆ అప్లికేషన్ డెవెలప్మెంట్ సంబంధించిన ఇంజినీర్లను ఆండ్రాయిడ్ మెసేజెస్ అప్లికేషన్ కు కేటాయిస్తున్నట్లు సమాచారం. గూగుల్ ప్రస్తుతం Imessage సర్వీసుకు పోటీగా, దీటుగా మంచి ప్రత్యామ్నాయం దృష్ట్యా ఆండ్రాయిడ్ మెసేజెస్ లో RCS మరియు మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లను పొందుపరచే ఆలోచనా క్రమంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోనుందని తెలుస్తుంది.

 

స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?స్మార్ట్‌ఫోన్‌‌లో సెన్సార్ల గురించి ఎప్పుడైనా విన్నారా ?

 అల్లో మీద భారీ అంచనాలనే ..

అల్లో మీద భారీ అంచనాలనే ..

గూగుల్ తన అప్లికేషన్, అల్లో మీద భారీ అంచనాలనే పెట్టుకుంది, వాట్సాప్ , టెలిగ్రాం వంటి సర్వీసులకు గట్టి పోటీని ఇవ్వగలదని ఆశించింది. కానీ అంచనాలన్నీ తలకిందులై ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. "అల్లో" లో ఎన్ని ఫీచర్లను పొందుపరచినా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది.

అంచనాలను మాత్రం..

అంచనాలను మాత్రం..

కానీ గూగుల్ వంటి టెక్నాలజీ దిగ్గజం నుండి ఈ అప్లికేషన్ వస్తుండడంతో అంచనాలను మాత్రం భారీగానే పెంచగలిగింది. ఐఫోన్ వినియోగదారులు Imessage వంటి ఫీచర్లను, మరియు వాట్సాప్ , టెలిగ్రాం వంటి చాటింగ్ అప్లికేషన్లకు అలవాటు పడిన ఆండ్రాయిడ్ వినియోగదారులు, చాటింగ్ లో మరికొన్ని అదనపు సౌకర్యాలను పొందేలా ఈ చాటింగ్ అప్లికేషన్ ఉంటుందని తెలిపింది . తద్వారా చాట్ అప్లికేషన్ కన్నా, RCS వంటి ఉత్తమ ఫీచర్లను ఆండ్రాయిడ్ మెసేజ్ లో పొందుపరచేలా ప్రయత్నాలు ప్రారంభించిందని నివేదికల సారాంశం.

కొన్ని వెబ్ నివేదికల ప్రకారం
 

కొన్ని వెబ్ నివేదికల ప్రకారం

తద్వారా కొన్ని వెబ్ నివేదికల ప్రకారం, గూగుల్ త్వరలో " చాట్ "అనే పేరుతో కొత్త అప్లికేషన్ తీసుకుని రాబోనుందని మరియు ఇది hangout కు పూర్తి వ్యత్యాసంతో ఉండనుందని తెలుస్తుంది. కానీ ఈ " చాట్ " అప్లికేషన్ కోసం, అల్లో ను వీడనుందని వస్తున్న పుకార్లలో ఏ మాత్రం నిజం లేదు. కావున "అల్లో" ని ఇష్టపడే వినియోగారులు నిశ్చింతగా ఉండవచ్చు.

అల్లో

అల్లో" ని కాస్త పక్కన పెట్టి..

క్రమంగా గూగుల్, "అల్లో" ని కాస్త పక్కన పెట్టి, " చాట్ " అప్లికేషన్ మీద దృష్టిని మరియు పెట్టుబడులను పెట్టనుందని తెలుస్తుంది. అల్లో ని వినియోగించే వారు కాస్త తక్కువగా ఉన్నా కూడా, దీని ఇంటర్ఫేస్ ఇష్టపడేవారు ఎక్కువగా ఉన్నారు. తద్వారా అప్డేట్స్ వస్తాయో లేక గూగుల్ hangouts వలె మిగిలిపోనుందో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

 ఓపెన్ హెరిటేజ్ ప్రాజెక్ట్

ఓపెన్ హెరిటేజ్ ప్రాజెక్ట్

ఈమధ్య గూగుల్ సంబంధించి మేము ప్రచురించిన ఒక వ్యాసంలో, గూగుల్, CyArk అనే లాభాపేక్షలేని సంస్థతో చేతులు కలిపింది. తద్వారా మానవ కార్యకలాపాలు లేదా, ప్రకృతి వైపరీత్యాల మూలంగా ప్రమాదానికి లోనవుతున్న చారిత్రాత్మక స్థలాల సంరక్షణకు గూగుల్ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయం. ఈ కలయికను ఓపెన్ హెరిటేజ్ ప్రాజెక్ట్ గా గుర్తించారు. తద్వారా 3D లో లేజర్ స్కానర్స్ మరియు మిల్లీమీటర్ ఖచ్చితత్వాన్ని ఇవ్వగల CyArk's 3D లేజర్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ స్మారక చిహ్నాలను కనిపెట్టే వీలు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Google halts Allo app development to favor android messaging More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X