‘సామ్‌సంగ్ పే’ ఇప్పుడు Bharat QR code పేమెంట్లను సపోర్ట్ చేస్తుంది

Posted By: BOMMU SIVANJANEYULU

మొబైల్ పేమెంట్స్ నిమిత్తం సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన 'సామ్‌సంగ్ పే’ వాలెట్ యాప్‌ లేటెస్ట్ అప్‌డేట్‌ను అందుకుంది. ఈ అప్‌డేట్‌తో సామ్‌సంగ్ పే యూజర్లు ఇక పై భారత్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయటం ద్వారా పేమెంట్స్ పూర్తిచేసే వీలుంటుంది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసే క్రమంలో తమ సామ్‌సంగ్ పే అప్లికేషన్‌ను యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌తో విజయవంతంగా ఇంటిగ్రేట్ చేసినట్లు సంస్థ తెలిపింది.

‘సామ్‌సంగ్ పే’ ఇప్పుడు  Bharat QR code  పేమెంట్లను సపోర్ట్ చేస్తుంది

డిజిటల్ పేమెంట్ సిస్టంను భారత్‌లో మరింత సులభతరం చేసే క్రమంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన సరికొత్త ఆన్‌లైన్ చెల్లింపు విధానామే ఈ Bharat QR code. మొబైల్ పేమెంట్ యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయి ఉండే ఈ ఫీచర్ ద్వారా మర్చెంట్‌కు కేటాయించిన భారత్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పిన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు చెల్లింపు పూర్తవుతుంది. నగదు నేరుగా మీ అకౌంట్ నుంచి మర్చంట్ బ్యాంక్ ఖతాలోకి వెళ్లిపోతోంది. భారత్ క్యూఆర్ కోడ్‌ను కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మాస్టర్ కార్డ్, వీసాలు అభివృద్ధి చేసాయి.

యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అనేది ఓ ఇన్‌స్టెంట్ రియల్-టైమ్ పేమెంట్ సిస్టం. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్‌ల మధ్య వేగంగా నగదును ట్రాన్స్‌‍ఫర్ చేసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్‌ఫేస్‌ను 24X7 ఉపయోగించుకోవచ్చు.

ఈ యాప్స్‌తో మీరు పీల్చే గాలి మంచిదో కాదో తెలుసుకోవచ్చు

లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా.. సామ్‌సంగ్ పే అప్లికేషన్ భారత్ క్యూఆర్ కోడ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ ఓరియా ఆపరేటింగ్ సిస్టంతోనూ పనిచేస్తోంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC), మాగ్నటిక్ సెక్యూర్ ట్రాన్స్‌మిషన్ (MST) వంటి అత్యాధునిక పేమెంట్ టెక్నాలజీలను సామ్‌సంగ్ పే యాప్ సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ పే సౌకర్యాన్ని POS మెచీన్, కార్డ్ రీడర్ అలానే, ఎన్ఎఫ్‌సీ రీడర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. సామ్‌సంగ్ పే ద్వారా చెల్లించే క్రమంలో యూజర్లు ముందుగా తమ ఫోన్‌లోని సామ్‌‌సంగ్ పే యాప్‌ను ఓపెన్ చేయవల్సి ఉంటుంది.

ఆ తరువాత కార్డును సెలక్ట్ చేసుకుని ఫింగర్ ప్రింట్ లేదా పిన్ ద్వారా authenticate చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత వర్తకుని వద్ద నగదు స్వీకరణ కోసం అందుబాటులో ఉంచిన పేమెంట్ టెర్మినల్‌కు సమీపంగా తన ఫోన్‌ను ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే చెల్లింపులు జరిగిపోతాయి.

English summary
Samsung Pay app has now got a new update which allows Samsung Pay users to scan Bharat QR codes to make easy UPI payments at merchants.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot