ఫ్లిప్‌కార్ట్ నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ కంప్యూటర్

Posted By:

ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి సారిగా తన సొంత బ్రాండ్ నుంచి ఓ ట్యాబ్లెట్ పీసీని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. జూన్ 26న నిర్వహింప తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ట్యాబ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్‌నోట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే మీడియాకు పంపింది.

 ఫ్లిప్‌కార్ట్ నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ కంప్యూటర్

రూ.10,000లోపు ధర శ్రేణిలో లభ్యమయ్యే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఫ్లిప్‌కార్ట్ ‘డిగీఫ్లిప్' బ్రాండ్ క్రింది విక్రయించనుంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లో మీడియాటెక్ చిప్‌సెట్‌ను వినియోగించినట్లు కంపెనీ వెల్లడించింది. ట్యాబ్లెట్ ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. ఇటీవల కాలంలో ఫ్లిప్‌కార్ట్, మోటరోలా మోటో సిరీస్‌ను విడుదలవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. దింతో ఈ రిటైలర్ పేరు ఇండియాలోని మారు మూల ప్రాంతాలకు సైతం విస్తరించింది.

ఫ్లిప్‌కార్ట్ చెల్లింపు సబ్‌‌స్క్రిప్షన్ సర్వీస్

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారుల కోసం ‘చెల్లింపు సబ్‌‌స్క్రిప్షన్ సర్వీస్'(Paid Subscription Service)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు రూ.500 చెల్లించి ఈ కొత్త సర్వీసు యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. 12 నెలల వ్యాలిడిటీతో కొనసాగే ఈ సబ్‌‌స్క్రిప్షన్ సర్వీస్‌లో భాగంగా వినియోగదారుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా తాను కొనుగోలు చేసే ఉత్పత్తులకు సంబంధించి ఉచిత హోమ్ డెలివరీ, అదే రోజు రాయితీతో కూడిన డెలివరీ, ప్రాధాన్యత కస్టమర్ సేవ తదితర ప్రయోజనాలను పొందవచ్చు.

ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్, యాదృచ్ఛికంగా ఎంపికచేయబడిన 75,000 మంది కస్టమర్లకు ఈ చెల్లింపు సబ్‌‌స్క్రిప్షన్ సర్వీస్‌ను 3 నెలల పాటు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత సబ్‌‌స్క్రిప్షన్‌కు ఎంపికైన ఆయ కస్టమర్‌లకు ఫ్లిప్‌కార్ట్ ఇ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఉచిత సబ్‌‌స్క్రిప్షన్‌కు అర్హత సాధించిన వినియోగదారులకు ఈ సేవ జూన్ 11, 2014 నుంచి సెప్టంబర్ 10, 2014 వరకు అందుబాటులో ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot