శాంసంగ్ ఫోన్ కాల్ సెట్టింగ్స్‌లో ఈ ట్రిక్స్ ఎప్పుడైనా చూశారా ?

|

మీరు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోనులో మీకు తెలియని ఎన్నో ట్రిక్స్ దాగున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్ కాల్ సెట్టింగ్స్ ను పరిశీలించినట్లయితే అందులో చాలామందికి తెలియని అనేక రకాలైన ట్రిక్స్ ఉన్నాయి. చాలామంది కాల్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడమో చేస్తుంటారు. అలా కాకుండా శాంసంగ్ సెట్టింగ్స్ లోని ఆప్సన్స్ మొత్తాన్ని చదివేస్తే ఎలా ఉంటుంది. కాల్ చేయడం రిసీవ్ చేసుకోవడం లాంటి కిటుకులను అలాగే ఫోన్ లో దాగి ఉన్న కొన్ని ఫీచర్లతో పాటు కాల్ సెట్టింగ్స్ లోని చిట్కాలను ఓ సారి తెలుసుకుందాం.

మిడ్‌రేంజ్ ధరలో బెస్ట్ ఫీచర్లతో యూజర్లను కట్టిపడేస్తున్న స్మార్ట్‌ఫోన్

గెశ్చర్స్
 

గెశ్చర్స్

ఆండ్రాయిడ్ లో బోలెడు గెశ్చర్లు దాగి ఉన్నాయి. శాంసంగ్ ఫోనులో దీన్ని డీఫాల్ట్ గా సెట్ చేసుకునే సౌలభ్యం ఉంది. అది పనిచేయకుంటే సెట్టింగ్స్ లో కెళ్లి అడ్వాన్స్ డ్ ఫీచర్స్ లో కెళ్లి స్వైప్ టూ కాల్ లేక సెండ్ మెసేజ్ ఆన్ చేయండి.ఒకవేళ ఈ ఫీచర్ నచ్చకుంటే మీరు డిసేబుల్ కూడా చేసుకోవచ్చు.

యాడ్ టూ ఫేవరేట్

యాడ్ టూ ఫేవరేట్

మీరు తరచుగా మాట్లాడేవారికి పేవరేట్స్ గా సెట్ చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఫేవరేట్ అనుకున్న కాంటాక్ట్ పై ట్యాప్ చేస్తే దిగువన డిటెయిల్స్ కనిపిస్తాయి. అందులో స్క్రీన్ మీద కనిపించే స్టార్ ఐకాన్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది.

Image source:guidingtech.com

యాడ్ టూ ఫేవరేట్

యాడ్ టూ ఫేవరేట్

మీరు తరచుగా మాట్లాడేవారికి పేవరేట్స్ గా సెట్ చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఫేవరేట్ అనుకున్న కాంటాక్ట్ పై ట్యాప్ చేస్తే దిగువన డిటెయిల్స్ కనిపిస్తాయి. అందులో స్క్రీన్ మీద కనిపించే స్టార్ ఐకాన్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది.

Image source:guidingtech.com

 యాడ్ స్పీడ్ డయల్
 

యాడ్ స్పీడ్ డయల్

కాంటాక్ట్స్ లో అత్యంత ముఖ్యమైన వారికి తక్షణం కాల్ చేయడం కోసం వారి పేరును స్పీడ్ డయల్ జాబితాలో పెట్టుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఫోన్ యాప్ ను ఓపెన్ చేసి దిగువన కనిపించే కీ ప్యాడ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందులోని నంబర్లలో దేనిపైనా అయినా కాసేపు నొక్కి పట్టుకుంటే అసైన్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్స్ లోకి తీసుకెళుతుంది. మీకు కావాల్సిన కాంటాక్ట్ ఎన్నుకుంటే అ నంబరు స్పీడ్ డయల్ జాబితాలోకి చేరిపోతుంది.

Image source:guidingtech.com

ఛేంజ్ ఓపెన్ మోడ్ ఆఫ్ ఫోన్ యాప్

ఛేంజ్ ఓపెన్ మోడ్ ఆఫ్ ఫోన్ యాప్

కాల్స్ ను కీ ప్యాడ్ జాబితాగా మార్చుకునే సౌలభ్యం ఉంది.

స్టెప్ 1

ఫోన్ యాప్ ను ఓపెన్ చేసి కీ ప్యాడ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి

స్టెప్ 2

కుడివైపున కనిపించే మూడు చుక్కల ఐకాన్ క్లిక్ చేశాక కనిపించే మెనూలో ఓపెన్ టూ కీ ప్యాడ్ ఆప్సన్ సెలక్ట్ చేస్తే సరిపోతుంది.

Image source:guidingtech.com

 డైరక్ట్ కాల్

డైరక్ట్ కాల్

స్క్రీన్ పై కనిపించే ఒక నంబరుకు ఫోన్ చేయాలంటే ఫోన్ ను మీ చెవి దగ్గరకు తీసుకెళ్తే చాలు. కాల్ వెళ్లిపోయే సౌకర్యం ఉంది. ఇందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి అడ్వాన్స్ డ్ ఫీచర్స్ లోకి వెళ్లి డైరక్ట్ కాల్ ను ఆఫ్ చేయవచ్చు.

మ్యూట్ చేయడం

మ్యూట్ చేయడం

ఇన్ కమింగ్స్ కాల్స్ మ్యూట్ చేయాలనుకుంటే మీ శాంసంగ్ ఫోన్ స్క్రీన్ పై మీ చేతిని అడ్డుపెడితే సరిపోతుంది. లేకుంటే ఫోన్ స్క్రీన్ ని నేలవైపు తిప్పినా సరిపోతుంది.

ఫ్లాష్ నోటిఫికేషన్స్

ఫ్లాష్ నోటిఫికేషన్స్

ఈ ఫీచర్ ను రెండు దశల్లో ఎనేబుల్ చేయవచ్చు.

స్టెప్ 1 :

ఫోన్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి ఎంచుకుని హియరింగ్ పై ట్యాప్ చేయాలి.

స్టెప్ 2 :

ఆ తర్వాత ఫ్లాష్ నోటిఫికేషన్స్ ను ట్యాప్ చేస్తే కెమెరా లైట్ స్క్రీన్ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కెమెరా లైట్ ని ఎనేబుల్ చేయాలి.

Image source:guidingtech.com

సింగిల్ ట్యాప్ ఆన్సర్

సింగిల్ ట్యాప్ ఆన్సర్

మనకు కాల్ వచ్చినప్పుడు సాధారణంగా స్వైప్ గెశ్చర్ ని ఉపయోగిస్తాం. కాని కొన్ని సంధర్భాల్లో అది వెంటనే పనిచేయదు. అలాంటప్పుడు సింగిల్ ట్యాప్ తో పని అయ్యేలా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్ లో కెళ్లి యాక్సస్ బులిటీని ఎంచుకుని సింగిల్ ట్యాప్ మోడ్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Samsung Call Settings Tips and Tricks more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X