బహుళ JPG ఇమేజ్ లను ఒకే PDF ఫైల్‌గా మార్చడం ఎలా?

|

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరికి సెల్ఫీలు మరియు ఫోటోల మీద మక్కువ పెరిగింది. ప్రతి ఒక్కరు తమ యొక్క జ్ఞాపకాలను ఫోటోల రూపంలో బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఫోటోలు అధిక స్టోరేజ్ ను తీసుకుంటాయి. అందుకోసం వీటిని PDF రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఫోటోని PDF ఫైల్‌లుగా మార్చడానికి అనుమతించే టూల్స్ ఆన్‌లైన్ లో చాలానే ఉన్నాయి. అయితే మీరు ఒకటికి మించి ఎక్కువ ఫోటోలను PDFకి మార్చాలని ప్లాన్ చేస్తుంటే కనుక కొన్ని మంచి ఎంపికలు మాత్రమే లగ్జరీని అందిస్తాయి. అంతేకాకుండా ఇది 'బలమైన కన్వర్టింగ్ టూల్' లేదా సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కువ JPG ఫోటోలను ఒకే PDFగా మార్చడం కోసం కష్టపడుతున్నట్లయితే వాటిని ఎలా చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

 
బహుళ JPG ఇమేజ్ లను ఒకే PDF ఫైల్‌గా మార్చడం ఎలా?

Windowsలో బహుళ JPG ఫోటోలను PDF ఫైల్‌గా మార్చే విధానం

** ముందుగా మీరు మార్చాలనుకుంటున్న అన్ని ఫోటోలను ఎంచుకుని వాటిని మీకు నచ్చిన పేరుతో క్రీయేట్ చేసుకున్న కొత్త ఫోల్డర్‌లో ఉంచండి.

** ఫోటోలను ఒక్కొక్కటిగా ఎంచుకోవడానికి Ctrl కీని నొక్కండి.

** ఆపై ఏదైనా హైలైట్ చేయబడిన ఫోటోపై రైట్ బటన్ క్లిక్ చేసి ప్రింట్ ఎంపికను ఎంచుకోండి.

బహుళ JPG ఇమేజ్ లను ఒకే PDF ఫైల్‌గా మార్చడం ఎలా?

** ప్రింటర్ విభాగం కింద మీరు మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు PDF ఎంపికని చూస్తారు.

** ఫోటో క్వాలిటీని సర్దుబాటు చేయడం కోసం కుడి వైపున కనిపించే లేఅవుట్ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. మీరు ఫోటోని షార్ప్ చేయాలనుకుంటే ఎంపికలను ఎంచుకోండి.

** ప్రివ్యూలో ఒక ఇమేజ్ కత్తిరించబడినట్లు కనిపిస్తే కనుక ఫ్రేమ్ బాక్స్‌కు ఫిట్ పిక్చర్ ఎంపికను తీసివేయండి.

** తర్వాత ప్రింట్‌ ఎంపికని ఎంచుకోండి. మీ PDF ఫైల్‌కు పేరును నమోదు చేయండి మరియు మీరు దానిని సేవ్ చేయాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకోండి. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయడానికి "సేవ్" ఎంపికను ఎంచుకోండి.

Macలో బహుళ JPG ఇమేజ్లను PDFగా మార్చే విధానం

బహుళ JPG ఇమేజ్ లను ఒకే PDF ఫైల్‌గా మార్చడం ఎలా?

- ప్రివ్యూ యాప్‌లో ఇమేజ్ లను ఓపెన్ చేయండి. మీరు బహుళ ఫోటోలను ఎంచుకున్నప్పుడు CMD కీని పట్టుకోండి.

- రైట్-క్లిక్ చేయండి > ఓపెన్ విత్ > ప్రివ్యూ ఎంపికను ఎంచుకోండి.

- క్రమంలో క్రమాన్ని మార్చడానికి సైడ్‌బార్‌లోని ఇమేజ్లను క్లిక్ చేసి లాగండి, పూర్తయిన తర్వాత ఫైల్ > ప్రింట్ ఎంచుకోండి.

- PDF డ్రాప్-డౌన్ మెనులో PDFగా సేవ్ చేయి ఎంచుకోండి.

- PDF ఫైల్‌కు పేరు పెట్టండి మరియు సేవ్ లొకేషన్ ను ఎంచుకోండి. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయడానికి "సేవ్" ఎంపికను ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
How to Convert Multiple JPG Images to a Single PDF File?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X