స్మార్ట్‌ఫోన్‌లలో దసరా నవరాత్రి వాట్సాప్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసి ఇతరులకు పంపడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద అధిక మంది ఇతరులకు త్వరగా మెసేజ్లను పంపడానికి ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. నేటి స్మార్ట్ యుగంలో ఏదైనా ఒక శుభకార్యానికి ఇంటి వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు తెలపడం ఎప్పుడో మరచిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సప్, పేస్ బుక్ వంటి ఇతర యాప్ల ద్వారా స్టికర్ల రూపంలో అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియాలో దసరా రోజులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రతి రోజు కొత్తగా ఉంటుంది. ఈ రోజు నవరాత్రి పండుగ యొక్క మొదటి రోజు ప్రారంభం అయింది. ఈ పండుగ అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఇండియాలోని ఇతర పండుగల మాదిరిగానే నవరాత్రి పండుగకు కూడా వాట్సాప్‌లో ప్రత్యేకత ఉంది. కరోనా మహమ్మారి కారణంగా మనలో చాలా మంది ఇప్పటికి మన ప్రియమైనవారికి దూరంగా ఉంటున్నాము. ఈ పరిస్థితుల కారణంగా వాట్సాప్ యొక్క స్టిక్కర్లు మరియు GIF లను పంపడం ద్వారా నవరాత్రి యొక్క పండుగ శుభాకాంక్షలను మీ యొక్క స్నేహితులకు మరియు బందువులకు తెలపవచ్చు. వీటిని ఎలా పంపాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Navratri 2021: How To Download And Send Navratri WhatsApp Stickers On Smartphones

వాట్సాప్ లో స్టిక్కర్ల సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంది. మనలో చాలామంది ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా స్నేహితులకు మెసేజ్ లను స్టిక్కర్‌ల రూపంలో పంపుతారు. ఇలా స్టిక్కర్‌లను పంపడం కొత్తేమీ కాదు. అయితే మీకు WhatsApp యానిమేటెడ్ స్టిక్కర్‌ల గురించి తెలియకపోతే కనుక మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ద్వారా నవరాత్రి స్టిక్కర్‌లను ఎలా సృష్టించాలి, డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు ఎలా పంపాలో తెలుసుకోవడానికి కింద ఉన్న దశల వారీ మార్గదర్శిని అనుసరించండి.

స్మార్ట్‌ఫోన్‌లలో నవరాత్రి వాట్సాప్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం

Navratri 2021: How To Download And Send Navratri WhatsApp Stickers On Smartphones

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి ఏదైనా WhatsApp చాట్‌ను ఓపెన్ చేయండి. చాట్ బార్‌లోని స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేసి, '+' గుర్తుకు వెళ్లండి.

స్టెప్ 2: తరువాత క్రిందికి స్క్రోల్ చేసి 'గెట్ మోర్ స్టిక్కర్స్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: తరువాత మీరు గూగుల్ ప్లే స్టోర్‌కు మళ్లించబడతారు. ఇక్కడ మీరు నవరాత్రి WhatsApp స్టిక్కర్‌ల కోసం శోధించవచ్చు.

స్టెప్ 4: తరువాత యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాన్ని ప్రారంభించండి. అప్పుడు మీరు యాప్‌ను ఓపెన్ చేసి, 'యాడ్ ఆన్ వాట్సాప్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: ఇప్పుడు ఇది స్వయంచాలకంగా WhatsApp లో అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులు వారి యొక్క స్వంత ఫోటోలతో కస్టమ్ స్టిక్కర్‌లను కూడా తయారు చేయవచ్చు. దాని కోసం మీకు 'స్టిక్కర్ మేక్ ఫర్ వాట్సాప్' మరియు 'స్టిక్కర్.లై' వంటి యాప్‌ల అవసరం ఉంటుంది. వీటిని మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో సులభంగా కనుగొనవచ్చు.

Navratri 2021: How To Download And Send Navratri WhatsApp Stickers On Smartphones

మీ స్వంత నవరాత్రి స్టిక్కర్లను తయారు చేసే విధానం?

స్టెప్ 1: ముందుగా మీకు నచ్చిన స్టిక్కర్ మేకర్ యాప్‌ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి 'కొత్త ప్యాక్‌ని సృష్టించు' ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: తరువాత మీరు మీ కొత్త ప్యాక్‌కు ఒక పేరును ఇవ్వాలి మరియు మీకు నచ్చిన ఫోటోతో స్టిక్కర్ చేయడానికి 'స్టిక్కర్‌లను జోడించు' పై క్లిక్ చేయండి. అయితే వాట్సప్‌లో స్టిక్కర్‌లను జోడించడానికి మీరు ఒక ప్యాక్‌లో కనీసం మూడు స్టిక్కర్‌లను తయారు చేయాలి.

స్టెప్ 4: మీరు మీ యొక్క శీర్షికలను కూడా జోడించవచ్చు. ఇప్పుడు WhatsApp కి స్టిక్కర్‌లను జోడించవచ్చు మరియు వాటిని మీ స్నేహితులతో పంచుకోవచ్చు. మీరు ఏదైనా వీడియోను ఉపయోగించి యానిమేటెడ్ స్టిక్కర్‌లను కూడా సృష్టించవచ్చు.

Best Mobiles in India

English summary
Navratri 2021: How To Download And Send Navratri WhatsApp Stickers On Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X