డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయారా, పోలీసులకు ఈ యాప్ చూపిస్తే చాలు !

By Hazarath
|

తెలంగాణా ప్రభుత్వం ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ పేరుతో ఓ ప్రత్యేకమైన యాప్‌ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసే ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి డాక్యుమెంట్లను ఈ యాప్‌లో డిజిటల్‌ రూపంలో దాచుకోవచ్చు. పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు యాప్‌ ఓపెన్‌ చేసి డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుంది. మరి ఇందులో మీ డాక్యుమెంట్లను ఎలా దాచుకోవాలి, పోలీసులకు ఎలా చూపించాలనే దానిపై ఓలుక్కేయండి.

 

రూ. 1000 నుంచి రూ 6 లక్షల కోట్లకు, 16 కోట్ల మందిని తాకిన జియోరూ. 1000 నుంచి రూ 6 లక్షల కోట్లకు, 16 కోట్ల మందిని తాకిన జియో

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆర్‌టీఏ ఎం-వాలెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్ కావాలనుకున్న వారు ఈ లింక్ మీద క్లిక్ చేైసి యాప్‌ని పొందవచ్చు.

ఆపిల్ ఐఫోన్ యూజర్లు ఈ లింక్ ద్వారా యాప్ పొందవచ్చు.
స్టెప్ 2

స్టెప్ 2

అది ఇన్‌స్టాల్ అయిన తరువాత అందులో మీ పేరు. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వివరాలతో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు రిజిస్టర్ అయి ఉంటే అక్కడ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

 స్టెప్ 3
 

స్టెప్ 3

మీరు వివరాలు ఎంటర్ చేయగానే మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. 6 నంబర్లతో కూడిన ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్ మిట్ బటన్ నొక్కాలి

 స్టెప్ 4

స్టెప్ 4

ఆ తరువాత మీకు RC and Driving License అని రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. RCలో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే Vehicle Chassisలోని లాస్ట్ 5 డిజిట్ నంబర్లను ఎంటర్ చేసి గెట్ బటన్ ప్రెస్ చేయాలి.

స్టెప్ 5

స్టెప్ 5

ఇక డ్రైవింగ్ లెసెన్స్ అనే దానిలో Driving License Number, Date of Birth, RTA office location లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో మీ పని విజయవంతంగా ముగుస్తుంది.

ఇంటర్నెట్ లేకపోయినా

ఇంటర్నెట్ లేకపోయినా

ఈ యాప్ మీ మొబైల్లో ఇంటర్నెట్ లేకపోయినా మీ వివరాలను అందజేస్తుంది. పోలీసులు మీ వెహికల్ ఆపిన సమయంలో దీనిలో ఉన్న వివరాలను చూపిస్తే సరిపోతుంది.

తెలంగాణలో మాత్రమే..

తెలంగాణలో మాత్రమే..

అయితే ఈ యాప్‌ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ రిజిస్టర్‌ అయిన వాహనాల సమాచారమే వస్తుంది. ఇక్కడి ఆర్‌టీఏ కార్యాలయాల్లో పొందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు మాత్రమే కనిపిస్తాయి.

ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు

ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు

దేశంలో మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ డ్రైవింగ్‌ చేస్తుంటే పోలీసులు పట్టుబడి ఈ డిజిటల్‌ యాప్‌ చూపిస్తే చెల్లదని అనొచ్చు. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు లైసెన్స్, ఆర్‌సీలను భౌతిక రూపంలో క్యారీ చెయ్యటమే బెటర్‌.

Image source : letmesearch.in

Best Mobiles in India

English summary
Steps to register your vehicle details on RTA m-Wallet, not required to carry license and RC Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X