మీ ఫోన్ మీద, మీకెప్పుడైనా కోపం వచ్చిందా..?

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోన్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలం..? గంట.. రెండు గంటలు.. రెండు రోజులు. అంతకన్నా ఎక్కువ సేపు ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోగలమా..? ఫోన్ మనందరి జీవితాల్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. కమ్యూనికేషన్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన సాధనంలో అవతరించిన స్మార్ట్‌ఫోన్ ఆధునిక బుతుకుల్లో ఆనందాలతో పాటు కల్లోలాలను కూడా రేపుతోంది.

మీ ఫోన్ మీద, మీకెప్పుడైనా కోపం వచ్చిందా..?

Read More : ఫోన్‌లో ఫేస్‌బుక్ వాడుతున్నారా..?, ఇవి తెలుసుకోండి

ఫోన్ కమ్యూనికేషన్ పై అతిగా ఆధారపడుతోన్న మనిషి ఆ ఫోన్ కారణంగానే కొన్ని పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోతున్నాడు. సృష్టి రహస్యంలో భాగమైన మనుషులే చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నపుడు, మనిషి ఏర్పాటు చేసుకున్న మొబైల్ ఫోన్ ఖచ్చితంగా పని చేస్తుందన్న గ్యారంటీ ఏంటి..? అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ స్పందించకపోతే దానిని విసిరిగొట్టేయలన్నంత కోపం మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. ఫోన్‌లను అసహ్యించుకునేలా చేసే సందర్భాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

జీరో నెట్‌వర్క్ జోన్‌లలో ఫోన్ సిగ్నల్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జెంట్ కాల్ లేదా మెయిల్‌ను పంపటానికి నానా ఇబ్బందులు పడతుంటాం. ఫోన్ పై మునుపెన్నడు చూపని చికాకును వ్యక్తపరుస్తుంటాం.

#2

మీకో అర్జెంట్ కాల్ వచ్చింది. ఆ కాల్‌ను ఖచ్చితంగా రిసీవ్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో హోమ్ స్ర్కీన్ స్లైడర్ పనిచేయకపోతే ఏం చేస్తారు..? ఇలాంటి సిట్యుయేషన్ చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదురయ్యే ఉండొచ్చు.

#3

కాల్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు కొన్నికొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా అవతలి వ్యక్తి నుంచి వచ్చే వాయిస్ క్లియర్‌గా వినిపించదు. ఒకరకమైన గందరగోళంతో కూడిన సౌండ్ మనల్ని కోపోద్రిక్తులను చేస్తుంది.

#4

ఎక్కువ నిడివితో ఉన్న వీడియో లేదా మ్యూజిక్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు..? డౌన్‌లోడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. సడెన్‌గా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. కారణమేంటని ఆరాతిస్తే ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్ అయిపోయిందని తేలింది. ఇలాంటపుడు మీ రియాక్షన్ ఏంటి..?

#5

ఒక ముఖ్యమైన గ్రూప్ చాట్ లో ఉన్నప్పుడు సడెన్‌గా ఫోన్ హ్యాంగ్ అయితే..? ఫోన్‌ను విసిరిగొట్టేయలన్నంత కోపం మనల్ని ఆవహిస్తుంది.

#6

ఫోన్‌లోని ముఖ్యమైన డేటా సడెన్‌గా డిలీట్ అయిపోతే..?, ఈ ఫీలింగ్ ఊహించుకుంటేనే భయకరంగా ఉంది కదండీ.

#7

ఒక ముఖ్యమైన గ్రూప్ చాట్ లేదా ప్రయివేట్ వ్యవహారంలో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోవటం కారణంగా ఫోన్ ఆగిపోతే ఏం చేస్తారు..? ఇలాంటి సిట్యుయేషన్‌లో మీ రియాక్షన్ ఏంటి..?

#8

స్మార్ట్‌ఫోన్‌లో ఓ హర్రర్ సినిమా చూస్తున్నారు.. ఓ భయంకరమైన విజువల్ స్ర్కీన్ పై ప్లే అవుతోంది.. మీలో ఉత్కంఠ మరింత పెరిగింది. సడెన్‌గా మీ ఫోన్ రింగ్‌టోన్ పెద్ద శబ్థంతో మోగింది. ఈ సిట్యుయేషన్‌లో ఏలా ఫీలవుతారు..?

#9

సడెన్‌గా ఫోటో తీసుకోవల్సి వచ్చింది. అదే సమయంలో ఫోన్ కెమెరా యాంప్ లాంచ్ అవ్వకపోతే..? ఏంటీ మీ రియాక్షన్.

#10

చాలా మందికి రాత్రుళ్లు లేటుగా నిద్రపోయి.. ఉదయం లేటుగా నిద్ర లేచే అలవాటు ఉంటుంది. వీళ్లకు పొద్దున్న లేవటం అంటే పరమ చిరాకు. వీళ్లకు ఫోన్ అలారమ్ అంటే ఏమాత్రం గిట్టదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ అలారమ్ గనుక మోగితే వెంటనే దానిని విసిరిగొట్టేయాలన్నంత కోపం వీరిలో కలుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Most Frustrating Things about Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot