46లక్షలు@జూన్..ఎయిర్‌టెల్ నెం.1

Posted By: Prashanth

46లక్షలు@జూన్..ఎయిర్‌టెల్ నెం.1

 

న్యూఢిల్లీ: సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జూన్‌లో కొత్తగా 46.4 లక్షల మంది వినియోగదారులు జీఎసఎమ్ సబ్ స్ర్కిప్షన్‌లను పుచ్చుకున్నారు. దింతో దేశంలోని మొత్తం జీఎస్ఎం యూజర్ల సంఖ్య 67.73కోట్లకు పెరిగింది.

సబ్‌స్ర్కిప్షన్‌లను అందిపుచ్చుకోవటంలో గత కొద్ది కాలంగా దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ఈ నెలలో కూడా తన హవాను కొనసాగించింది. గడచిన జూన్‌లో భారతీ ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 20 లక్షలకు పెరిగి 18.73కు చేరుకుంది. మరో టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా జూన్‌లో 12.2 లక్షల ఆపరేటర్లను రాబట్టగలిగింది.

దీంతో సంస్థ మొత్తం జీఎస్ఎం యూజర్లు 15.37కోట్లకు చేరుకుంది. ఐడియా సెల్యులార్ కనెక్షన్లు 11.9 లక్షలు పెరిగి 11.71 కోట్లకు చేరుకున్నాయి. 2జీ లైసెన్స్ లు రద్దయిన ఆపరేటర్లు వీడియోకాన్ 6.6లక్షల కొత్త చందాదారులను సేకరించగా, యూనినార్ 5లక్షల కొత్త యూజర్లను పొందగలిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot