మొబైల్ యూజర్లూ..కాల్ రేట్లు పెరగనున్నాయ్..?

Posted By: Prashanth

మొబైల్ యూజర్లూ..కాల్ రేట్లు పెరగనున్నాయ్..?

 

బార్సిలోనా: ఇంతకు ముందు మొబైల్ ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ (రేడియో తరంగాల)ను ఉచితంగా కేటాయించడం మూలంగా తక్కువ ధరలకే టెలికాం సర్వీసులను ఇవ్వడం సాధ్యమైంది. మారిన పరిస్ధితులు నేపధ్యంలో మొబైల్ ఆపరేటర్లు స్పెక్ట్రమ్‌కు చార్జీలు చెల్లించాల్సి వస్తే వినియోగదారుల పై ఆ భారం పడక తప్పదని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ తెలిపారు. గురువారం నిర్వహించిన మొబైల్ వరల్డ్ క్రాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో ఆయన పొల్గొన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో ముచ్చటిస్తూ భారత ప్రజల్లో సామాజిక మార్పు తెచ్చేందుకు మొబైల్ ఫోన్లు శక్తివంతమైన సాధనంగా మారిన నేపథ్యంలో మొబైల్ ఫోన్ సర్వీసులను టెలికాం పరిశ్రమ అందుబాటు ధరలకే అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ స్పెక్ట్రమ్ చార్జీలు పెరిగితే కాల్ చార్జీలూ పెరుగుతాయన్నారు. కాగా మొబైల్ ఆపరేటర్ల వద్ద ఉన్న అదనపు స్పెక్ట్రమ్‌కు వన్‌టైమ్ ఫీజు చెల్లించాలన్న ప్రతిపాదనను పాత టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot