బ్లాక్‌బెర్రి చివరి స్మార్ట్‌ఫోన్, లాంచింగ్‌కు రెడీ !

Written By:

ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఒకప్పుడు సంచలనం రేపిన బ్లాక్‌బెర్రి ఎట్టకేలకు తన చివరి స్మార్ట్‌ఫోన్‌ మెర్క్యూరీను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తన ఇన్ హౌస్‌లో డిజైన్ చేసిన ఆఖరి స్మార్ట్‌‌ఫోన్‌ మెర్క్యూరీను వచ్చే నెల బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కాని లేకుంటే దాని కన్నా ఓ రోజు ముందుగాని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్లాక్‌బెర్రి మొబైల్ అకౌంట్లో ఈ లాంచింగ్ రీవిల్ చేస్తూ ట్వీట్ చేసింది.

గెలాక్సీ S8పై శాంసంగ్ సంచలన నిర్ణయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ డివైజ్‌లలో మెర్క్యూరీ మూడోవది

చైనా టీసీఎల్ కమ్యూనికేషన్ తయారుచేసిన బ్లాక్‌బెర్రీ డివైజ్‌లలో మెర్క్యూరీ మూడోవది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ వీడియోను టీసీఎల్ ఉత్తర అమెరికా అధ్యక్షుడు స్టీవ్ సిస్టుల్లీ విడుదల చేశారు.

మిగతా వివరాలు

జనవరి మొదట్లో లాస్‌వేంగాస్‌లో జరిగిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో‌లో ఈ ఫోన్ గురించి బ్లాక్‌బెర్రీ, టీసీఎల్ మొదటిసారి రివీల్ చేశాయి. కానీ మిగతా వివరాలు వేటిని ఇవి ప్రకటించలేదు.

క్వార్టీ కీబోర్డు

కొత్త మెటాలిక్‌తో రాబోతున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టచ్‌స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, క్వార్టీ కీబోర్డు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కీబోర్డు మెసేజ్‌లు, ఈమెయిల్స్ చేసుకోవడానికి ఎంతో సహకరించనుందని కంపెనీ చెబుతోంది.

రెండు స్పీకర్స్

ఈ ఫోన్ అల్యూమీనియం బాడీతో రానున్నట్లు తెలుస్తోంది. సైడ్ లో బ్లాక్ యాంటెన్నాను పొందుపరిచారు. బాటమ్ లో యుఎస్ బి ఫోర్ట్ ఉండనుంది. రెండు స్పీకర్స్ బాటమ్ లో ఉండనునన్నట్లు తెలుస్తోంది. పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ డివైస్ రైట్ సైడ్ లో పొందుపరిచారు.

4జిబి ర్యామ్

4జిబి ర్యామ్ తో ఈ ఫోన్ రానుంది. బ్యాటరీ విషయానికొస్తే 3400mAh బ్యాటరీ. కెమెరా విషయానికొస్తే 18 ఎంపీ రేర్ కెమెరాను బ్యాక్ సైడ్ పొందుపరిచారు. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ.

సాప్ట్‌వేర్‌పై ఎక్కువగా ఫోకస్

ఫోన్లు డిజైన్ చేయడం నుంచి తాము వైదొలుగుతామని బ్లాక్‌బెర్రీ సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. సాప్ట్‌వేర్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఇన్-హౌజ్ నుంచి రాబోతున్న ఫైనల్ స్మార్ట్‌ఫోన్ ఇదేనని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BlackBerry Ltd sets release date for its final smartphone designed in-house read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot