మార్కెట్లోకి రిలయన్స్ ద్వారా కూల్‌ప్యాడ్ సీడీఎంఏ ఫోన్లు

Posted By: Super

మార్కెట్లోకి రిలయన్స్ ద్వారా కూల్‌ప్యాడ్ సీడీఎంఏ ఫోన్లు

కూల్‌ప్యాడ్ కమ్యూనికేషన్స్ ఇండియా చైనీస్ కంపెనీ వైర్ లెస్ టెక్నాలజీస్ లి. భాగస్వామ్యంతో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. కూల్‌ప్యాడ్ ఇటీవలే మార్కెట్లోకి మూడు కొత్త హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేసింది. వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గవి కూల్‌ప్యాడ్ మొదటి వెంచర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కొత్త కూల్‌ప్యాడ్ సీడీఎంఏ ఫోన్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. మొబైల్ డేటా వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ భాగస్వామ్యంతో కూల్‌ప్యాడ్ వాయిస్ అండ్ డేటా ప్లాన్స్ విషయంలో కూడా కొన్ని డిస్కౌంట్స్‌ని ఆఫర్ చేసింది.

కూల్‌ప్యాడ్ విడుదల చేసిన మొబైల్ పీచర్స్ ఎమంత ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ 800 MHz ప్రాసెసర్‌తో 256 MB RAM సైజుని కలిగి ఉంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.5 ఇంచ్ టచ్ స్క్రీన్‌తో రూపోందించబడింది. ఇండియాలో సిడిఎమ్ఎ హ్యాండ్ సెట్స్ యొక్క ధరను సుమారుగా రూ 3,500గా నిర్ణయించడమైంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి జిఎస్ఎమ్ హ్యాండ్ సెట్స్‌ని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్‌కామ్ కోల్‌కతా సర్కిల్ హెడ్ మితాష్ చటర్జీ చెప్పారు.

జిఎస్ఎమ్ హ్యాండ్ సెట్స్ ఆండ్రాయిడ్ ఆపేరటింగ్ సిస్టమ్ వర్సన్ 2.1 జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతాయి. ఈ హ్యాండ్ సెట్స్ 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి చూడచక్కని ఇమేజిలను తీసేందుకు ఉపయోగపడతాయి. కంప్యూటర్స్‌కు వైర్ లెస్ కనెక్ట్ చేసుకునేందుకు గాను 1x మోడమ్ మాదిరి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 4జిబి వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. వీటితో పాటు ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు. ప్రస్తుతం మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

కూల్‌ప్యాడ్ డీ530 సీడీఎంఏ ఫోన్‌లో 3.1 ఎంబీపీఎస్ హై స్పీడ్ డేటా, 3.5 అంగుళాల టచ్‌స్క్రీన్, 1.3 మెగాపిక్సెల్ కెమెరా రిలయన్స్ నెట్‌కనెక్ట్, బ్లూటూత్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.7,999గా ఉండవచ్చునని భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot