మార్కెట్లోకి గూగుల్ నెక్సస్ 6

Posted By:

 మార్కెట్లోకి గూగుల్ నెక్సస్ 6

జీఓఎస్ఎఫ్ 2014ను పురస్కరించుకుని గూగుల్ తన నెక్సస్ 6 స్మార్ట్‌‍ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ బుధవారం (నేటి నుంచి) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చు. 32జీబి వేరియంట్ ధర రూ.43,999. 64జీబి వేరియంట్ ధర రూ.48,999. నెక్సస్ 6తో పాటు డిజిటల్ మీడియా ప్లేయర్ క్రోమ్ కాస్ట్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,399. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ వద్ద ఈ డివైస్‌ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6 స్పెసిఫికేషన్‌‍లు:

5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్,
అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
news, smartphones, google, nexus 6, android lollipop, న్యూస్, స్మార్ట్‌ఫోన్‌లు, గూగుల్, నెక్సస్ 6, ఆండ్రాయిడ్ లాలీపాప్
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot