స్టార్ల మధ్య ‘బిగ్‌ఫైట్’!!

Posted By: Prashanth

స్టార్ల మధ్య ‘బిగ్‌ఫైట్’!!

 

స్మార్ట్‌పోన్ మార్కెట్లో సంచలనం రేకెత్తిస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి ప్రత్యర్ధుల బెడద మొదలైంది. ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌జీ ‘ఆప్టిమస్ ఎల్‌టీఈ2’ పేరుతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రాబోతున్న ఎల్‌టీఈ2, ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను గట్టిపోటీనివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆప్టిమస్ ఎల్‌టీఈ2‌లో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు:

2జీబి ర్యామ్,

ట్రూ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టాండర్డ్ 2150mAhబ్యాటరీ,

వైర్‌లెస్ ఇండక్షన్ ఛార్జింగ్,

శక్తివంతమైన కెమెరా.

ఫోన్‌లో పొందుపరిచిన 2జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు తోడ్పడుతుంది. ఏర్పాటు చేసిన ఐపీఎస్ హై డెఫినిషన్ డిస్‌ప్లే ఉత్తమమైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. అమర్చిన స్టాండర్డ్ 2150mAh బ్యాటరీ బ్యాకప్‌ను అదనంగా 40శాతం పొడిగిస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం వేలాది అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, యూజర్ ఫ్రెండ్లీ టాస్కింగ్‌ను యూజర్‌కు అందిస్తుంది. వైర్‌లెస్ ఇండక్షన్ ఛార్జింగ్, వాయిస్ రికార్డింగ్ వంటి అదనపు ఫీచర్లు హ్యాండ్‌సెట్ విశిష్టతను రెట్టింపు చేస్తాయి. ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌టీఈ2ను తొలత దక్షిణ కొరియాలో విడుదలచేయునున్నారు. అక్కడి స్పందనను పరిగణలోకి తీసుకుని యూఎస్‌లో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot