మైక్రో మ్యాక్స్ మల్టీ మీడియా ఫోన్!!

Posted By: Prashanth

మైక్రో మ్యాక్స్ మల్టీ మీడియా ఫోన్!!

 

అత్యాధునిక ఫీచర్లతో మైక్రో మ్యాక్స్ మరో ట్రెండీ మొబైల్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో మార్కెట్లో విడుదల చేసింది. ఉపయుక్తమైన అనేక రకాల ఫీచర్లను ‘మైక్రో మ్యాక్స్ X261’ మల్టీ మీడియా ఫోన్ లో నిక్షిప్తం కాబడ్డాయి.

ముఖ్య ఫీచర్లు: 2.2 అంగుళాల QVGA కలర్ డిస్ ప్లే, చుట్టు కొలతలు 112 mm x 48 mm x 15.4 mm, జీఎస్ఎమ్ నెటవర్క్ ను సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ సౌలభ్యత, పటిష్టమైన 1000 mAh బ్యాటరీ వ్యవస్థ బ్యాకప్ సామర్ధ్యం 4.5 గంటలు, 1.3 మెగా పిక్సల్ కెమెరా, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, మల్టీ మీడియా ప్లేయర్, కనెక్టువిటీని మరింత పటిష్టం చేస్తూ జీపీఆర్ఎస్, బ్లూటూత్, WAP, యూఎస్బీ తదితర సాఫ్ట్ వేర్లను మొబైల్ లో నిక్షిప్తం చేశారు. మెమరీని ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా 8 జీబి వరకు పెంచుకోవచ్చు.

తక్కువ ధరలో మన్నికైన మొబైల్ కోసం ఎదురు చూస్తున్న వారికి మైక్రో మ్యాక్స్ X261 ఉత్తమమైన ఎంపిక. ఉత్సాహాపూరితమైన కలర్ కాంబినేషన్లలో డిజైన్ కాబడిన ఈ మొబైల్ ఆకర్షణీయమైన లుక్ కలగి ఉంటుంది. బ్లాక్ మరియు కాపర్ రంగులను మొబైల్ డిజైనింగ్ లో వినియోగించారు. సౌకర్యవంతంగా ఈ మొబైల్ అరచేతిలో ఇముడుతుంది. ఇండియన్ మార్కెట్లో ‘మైక్రో మ్యాక్స్ X261’ ధర రూ.2500. త్వరపడండి మరి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting