మోటో కొత్త ఫోన్లు ఇండియాకి వచ్చేశాయ్, అదిరే ఫీచర్లు, బడ్జెట్ ధర

|

బడ్జెట్ ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన జి6, జి6 ప్లే ఫోన్లను మోటొరోలా ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి మోటో జి5 సిరీస్ కు కొనసాగింపుగా వచ్చాయి. ఇండిగో బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ ఫోన్ విడుదల కాగా 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.15,999 ధరలకు వినియోగదారులకు ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. దీంతోపాటు మోటో హబ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

 

OTP చెప్పిన పాపానికి రూ.6.98 లక్షలు గోవిందా, మోసాలను అరికట్టండిలా ?OTP చెప్పిన పాపానికి రూ.6.98 లక్షలు గోవిందా, మోసాలను అరికట్టండిలా ?

మోటో జీ6 ఫీచర్లు

మోటో జీ6 ఫీచర్లు

5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, 4జీ వీవోఎల్‌టీఈ, డాల్బీ ఆడియో, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.
జి6 అమేజాన్ లో మాత్రమే విక్రయానికి ఉంటుంది. 3జీబీ ర్యామ్ ధర రూ.13,999. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,999.

మోటో జి6ప్లే మోడల్
 

మోటో జి6ప్లే మోడల్

మోటో జి6ప్లే మోడల్ లో జి6 మాదిరిగానే 5.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. కాకపోతే రిజల్యూషన్ హెచ్ డీ మాత్రమే. 18:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. ఇది 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఉంటుంది. ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 పై పనిచేస్తుంది. ఫోన్ తో 15 వాట్ టర్బో చార్జర్ వస్తుంది. జి6 ప్లే ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది. ధర రూ.11,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ గా రూ.1,000 తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ, తిరిగి ఫ్లిప్ కార్ట్ కే అమ్మితే రూ.5,100 చెల్లించే హామీలను కూడా ఇస్తోంది.

రెండు కెమెరాలు

రెండు కెమెరాలు

మోటో జీ6 స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయగా దీనికి ఫ్లాష్ సదుపాయం కూడా కల్పించారు. అత్యంత తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలు తీసుకునేలా ఈ కెమెరాను డిజైన్ చేశారు.

పలు ఆకర్షణీయమైన ఆఫర్లను..

పలు ఆకర్షణీయమైన ఆఫర్లను..

మోటో జీ6 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఫోన్‌ను కొంటే రూ.1250 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్

పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్

అలాగే పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి డివైస్‌ను కొంటే రూ.1200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.1వేయి వరకు అదనంగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Moto G6 Moto G6 Play India launch Highlights: Price starts at Rs 11,999; sale from midnight More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X