ఐఫోన్ కోసం కెమెరా లెన్స్!!

Posted By: Prashanth

ఐఫోన్ కోసం కెమెరా లెన్స్!!

 

ప్రత్యేకించి ఐఫోన్ మోడల్స్ కోసం వీటెక్ సంస్థ కెమెరా లెన్స్‌ను వ్ళద్ధి చేసింది. ఈ లెన్స్‌ను ఐఫోన్‌లకు జత చేయటం వల్ల ఫోటో క్వాలిటీ గణనీయంగా పెరుగుతుంది. మూడు మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ లెన్స్ ప్రత్యేకించి ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 3జి, ఐఫోన్ 3జీఎస్, ఐఫోన్‌4లకు సానుకూలంగా స్పందిస్తాయి.

క్యామ్ -1209 ఆల్యూమినియమ్ టెలీఫోటో లెన్స్:

* దూర విషయాలను క్యాప్చుర్ చేసే తత్వం, జూమింగ్ సామర్ధ్యం 12ఎక్స్, లెన్స్ కనిష్ట ఫోకస్ దూరం 3 మీటర్లు, లెన్స్ వాస్తవిక డయామీటర్ 12ఎమ్ఎమ్, బరువు 11.8గ్రాములు, ధర రూ.2,800.

వైడ్ రేంజ్ లెన్స్ అండ్ మాక్రో లెన్స్:

ఈ రెండు లెన్సు్‌లను కలిపి సింగిల్ కిట్‌లో పొందుపరిచారు. ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీకి ఈ లెన్స్ తోడ్పడతాయి. చిత్రీకరణ సమయంలో వినియోగదారుడు బహుముఖ ప్రజ్ఞను కనబరిచే అవకాశాన్ని ఈ కిట్ కల్పిస్తుంది. ధర రూ. 2,000.

ఫిష్ ఐ లెన్స్:

ఈ లెన్స్ ఫోటో క్వాలిటీని మరింత వ్ళద్ధి చేస్తుంది. బరువు కేవలం 13.2 గ్రాములు. ధర రూ.1700.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot