స్మార్ట్ స్పీకర్లతో రిస్క్ ఎక్కువే...ఎలా అంటరా?

By Madhavi Lagishetty
|

ఈ మధ్య కాలంలో మార్కెట్లో మొత్తం కూడా స్మార్ట్ స్పీకర్ల హవానే కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తున్న గూగుల్ హోం, అమెజాన్ ఎకోతో పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ గా గూగుల్ను ప్రారంభించింది. అంతేకాదు ఈ మధ్యనే అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లకు పోటీగా ఆపిల్ కూడా స్మార్ట్ స్పీకర్లను పరిచయం చేసింది.

 
స్మార్ట్ స్పీకర్లతో రిస్క్ ఎక్కువే...ఎలా అంటరా?

అయితే ఇవి సాధారణంగా వైర్ లెస్ స్పీకర్లు . బ్లూటూత్, nfc, స్పీకర్ ఫోన్ మరియు వాటిలో నిర్మించిన వాయిస్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ స్పీకర్స్ సింగిల్ యూనిట్ వైర్ లెస్ స్పీకర్లుగా పనిచేస్తాయి. అమెజాన్, ఆపిల్, గూగుల్ నుంచి ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI) ను కలిగి ఉన్నాయి.

ఈ స్మార్ట్ స్పీకర్లు వాయిస్ కమాండ్ తోపాటు పలు అంశాలను కూడా మానిటరింగ్ చేయగలవు. ఉదాహరణగా మీరు మీకు కావాల్సిన పాటను ప్లే చేయమని అడగవచ్చు. అంతేకాదు టైమర్ను కూడా సెట్ చేయమని అడగవచ్చు. AV సిస్టమ్ ను కూడా కంట్రోల్ చేయవచ్చు. OK GOOGLE, అలెక్సా లేదా హే సిరి వంటి పదాల ద్వారా స్పీకర్లు ట్రిగ్గర్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ స్పీకర్స్ చెవులకు ఎంతో మ్రుదువైన భావనను కలిగిస్తాయి.

అయితే ఈ స్మార్ట్ స్పీకర్స్ తో మీ ప్రైవసీకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ హోం, అమెజాన్ ఎకో, ఆపిల్ హోం పాడ్ సహా ఇతర స్మార్ట్ స్పీకర్లను ఉపయోగించినప్పుడు మీ ప్రైవసీకి ఆటంకం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఎలా అంటరా? ఈ క్రింది జాబితాను అనుసరించి తెలుసుకోండి.

స్మార్ట్ స్పీకర్లతోనే ఎక్కువగా మాట్లాడటం..

స్మార్ట్ స్పీకర్లతోనే ఎక్కువగా మాట్లాడటం..

మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లో ఇది ఒకటి. స్మార్ట్ స్పీకర్లు ఎప్పుడూ మన సంబాషణను వింటూ ఉంటాయి. మ్యూట్ కోసం టోగుల్ ఆన్ చేస్తే తప్పా, మీరు మాట్లాడే ప్రతి పదం రికార్డు చేస్తుంది. మీ డివైసులోనుంచి కొన్ని సెకన్ల తర్వాత వినిపిస్తున్న ఆడియోను ప్రొసెస్ చేస్తుంది.

అంతేకాదు రన్ అవుతున్న ఆడియో బఫర్ను డిలీట్ చేస్తుంది. స్మార్ట్ స్పీకర్ల ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా సర్వర్ కు చేరుతుంటాయి. వీటిని ప్రొసెస్ చేయడానికి సర్వర్లకు కమాండ్స్ పంపుతుంది. తర్వాత సమాధానం వస్తుంది.

డేటా స్టోరేజి.....

డేటా స్టోరేజి.....

మీరు స్పీకర్లతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, అది ఆడియో స్నిప్పెట్లను స్టోరేజి చేస్తుంది. వాటిని మీ అకౌంట్లోకి లాగ్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే, మీ అకౌంట్ను ఓపెన్ చేసి మీరు ఇంతకుముందు మాట్లాడిన సంబాషణను వినవచ్చు. ఈ డేటాను కొంతవరకు డిలీట్ చేయవచ్చు. కానీ గూగుల్ లేదా అమెజాన్ యొక్క సర్వర్లల స్టోరేజ్ చేసిన అగ్రిగేటెడ్ డేటాను మీరు డిలీట్ చేయలేరు.

పరిసర ప్రాంతాల ఆడియోలు....
 

పరిసర ప్రాంతాల ఆడియోలు....

ఈ స్పీకర్లు కేవలం మీరు మాట్లాడిన సంబాషణలే కాదు....పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడియోలను కూడా సేకరిస్తాయి. మీ ఇంట్లో జరిగే విషయాలు, టీవీలో మీరు ఏ ఛానెల్స్ చూస్తున్నారు, మీరు ఇష్టపడే క్రీడలు, మీ పెంపుడు జంతువులు, కుటుంబంలో లింగ నిష్పత్తి వీటిన్నింటిని రికార్డు చేయవచ్చు.

ఢమాలైన చైనా మొబైల్ మార్కెట్ , 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే !ఢమాలైన చైనా మొబైల్ మార్కెట్ , 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే !

లా అండ్ ఆర్డర్స్....

లా అండ్ ఆర్డర్స్....

NSA గూఢచర్యం గురించి అందరికీ తెలిసిన తర్వాత, ఇంగ్లండ్ లో నివసిస్తున్న నిర్వాసితుల ఇంటర్నెట్ హిస్టరీలు, ఫుడ్ స్టాండర్ట్స్ ఏజెన్సీ నుంచి వర్క్ అండ్ పెన్షన్స్ శాఖకు యాక్సెస్ చేయడానికి అనుమతించే ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇతర దేశాలు కూడా ఈ దారిలోనే వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

రిస్క్ ఆఫ్ హ్యాకింగ్....

రిస్క్ ఆఫ్ హ్యాకింగ్....

అమెజాన్ ఎకోకు వచ్చినప్పుడు మీరు అలెక్సా సహాయంతో నేరుగా అమెజాన్ ద్వారా వస్తువులను కొనవచ్చు. ఎవరైనా మీ డివైసును దొంగలించినట్లయితే...భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
One of the fastest growing tech in the recent past undoubtedly goes to the Smart speakers. This devices also comes with privacy risk as well. We have listed out 5 privacy invasions possible when you use smart speakers including Google Home, Amazon Echo, and Apple HomePod.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X