ట్రెండ్ సెట్ చేసిన షియోమి, రెడ్‌మి 5A న్యూ రికార్డ్ సేల్స్ !

Written By:

ప్రముఖ చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మొబైల్ మార్కెట్లో రోజురోజుకు దూసుకుపోతోంది. కొత్త సంవత్సరవ కొత్త రికార్డులతో దిగ్గజాలకు ఇండియాలో సవాల్ విసురుతూ వెళుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో షియోమి టాప్ సెల్లింగ్ బ్రాండ్స్‌ స్మార్ట్‌ఫోన్‌​ విక్రయాల్లో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షియోమి ఇండియా హెడ్ మను కుమార్‌ జైన్‌ ట్విటర్‌లో ప్రకటించారు. అమెజాన్ లో అమ్ముడువుతన్న ప్రతి 5 ఫోన్లలో 4 షియోమి కంపెనీవేనని షియోమి సగర్వంగా ప్రకటించింది.

నోకియా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశ్ కా స్మార్ట్‌ఫోన్

ఇదిలా ఉంటే షియోమి పాపులర్ మోడల్ అలాగే దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరిట మార్కెట్లోకి దూసుకొచ్చిన రెడ్‌మీ 5ఎ భారీగా అమ్మకాలను కొల్లగొట్టింది. లాంచ్ అయిన నెలరోజుల్లోనే ఈ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌‌ఫోన్‌ భారత్‌లో మిలియన్‌కు పైగా విక్రయాలను సాధించిందని జైన్‌ వెల్లడించారు.

రెడ్‌మీ 5ఎ పీచర్లు

Redmi Note 5A (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరువు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5 మిల్లీ మీటర్లు.

 

 

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్‌

ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే రెడ్‌మీ 5ఎ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్‌లో 10 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభ్యం అవుతోంది.

ఫోన్ ధర

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు కూడా ఎంట్రీ లెవల్లో ఉండటం కంపెనీకి బాగా కలిసివచ్చింది. ప్రస్తుతం రెడ్‌మీ 5ఎ 2జిబి ర్యామ్ ఫొన్ ధర రూ. మొదటి 50 లక్షల యూనిట్లకు రూ.4999గా ఉంది.

3జిబి ర్యామ్ ధర రూ.7,499

ఆ తరువాత నుంచి ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 5999గా నిర్ణయించనుంది. అలాగే 3జిబి ర్యామ్ ధర రూ.7,499గా ఉంది.

రిలయన్స్ జియో ఆఫర్

కాగా రిలయన్స్ జియో ఈ ఫోన్ మీద రూ. 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. యూజర్లు 198తో 12 నెలల పాటు రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వారికి వర్తిస్తుంది. ప్రతి రీఛార్జ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ ఓచర్ లభిస్తుంది. దాన్ని తరువాత రీఛార్జ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Redmi 5A India Sales Cross 1 Million Units Within a Month of Launch, Says Xiaomi in Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot