సోనీ నుంచి సరికొత్త బ్లూటూత్ స్టీరియో హెడ్‌సెట్

Posted By:

ఉత్తమ క్వాలిటీ ఆడియో ఉత్పత్తులను వినియోగదారులకు చేసే సోనీ తాజాగా ఎస్‌బిహెచ్80 పేరుతో సరికొత్త స్టీరియో బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam ద్వారా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,149. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ హెడ్‌సెట్‌లను సోనీ రూపల్పన చేసింది. 5.8ఎమ్ఎమ్ డైనమిక్ స్పీకర్ వ్యవస్థను హెడ్‌సెట్‌లో పొందుపరిచారు.

సోనీ నుంచి సరికొత్త బ్లూటూత్ స్టీరియో హెడ్‌సెట్

వర్షంలో సైతం ఈ హెడ్‌సెట్‌ను ఉపయోగించవచ్చు. క్రిస్టల్ క్లారిటీ ఆడియోను ఈ హెడ్‌సెట్ ద్వారా ఆస్వాదించవచ్చు. ఫ్రీక్వెన్సీ సామర్థ్యం 10Hz-20000Hz. హైడెఫినిషన్ మైక్రోడైనమిక్స్ డ్రైవర్లను ఈ డివైస్‌లో పొందుపరిచారు. నిక్షిప్తం చేసిన హైడెఫినిషన్ వాయిస్ ఫీచర్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో రియాల్టీ అనుభూతులను చేరువ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇలా అన్ని కమ్యూనికేషన్ పరికరాలకు ఈ హెడ్‌సెట్‌లను అనుసంధానించుకోవచ్చు. హెడ్‌సెట్‌లోని బ్లూటూత్ మల్టీ-పాయింట్ ఫీచర్ సౌకర్యంతో ఏకకాంలో రెండు డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot